రోడ్డు పక్కకు దూసుకెళ్లిన పెళ్లిబస్సు

ABN , First Publish Date - 2021-01-27T04:53:18+05:30 IST

వివాహశుభకార్యం ముగించుకొని పెనుబల్లి మండలం కర్లగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్లుతున్న పెళ్లి బస్సు కొణిజర్ల సమీపంలో చెట్టును డీకొని రోడ్డుప్రక్కకు దూసుకెళ్లిన సంఘటన సోమవారం అర్ధరాత్రి అనంతరం 2,30 నిమిషాల సమయంలో జరిగింది.

రోడ్డు పక్కకు దూసుకెళ్లిన పెళ్లిబస్సు
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు

 ఐదుగురికి స్వల్పగాయాలు

కొణిజర్ల,జనవరి26: వివాహశుభకార్యం ముగించుకొని పెనుబల్లి మండలం కర్లగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్లుతున్న పెళ్లి బస్సు కొణిజర్ల సమీపంలో చెట్టును డీకొని రోడ్డుప్రక్కకు దూసుకెళ్లిన సంఘటన సోమవారం అర్ధరాత్రి అనంతరం 2,30 నిమిషాల సమయంలో జరిగింది. ఎస్‌ఐ మొగిలి తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్‌ దగ్గర చర్లపల్లికి చెందిన యువతితో కర్లగూడేనికి చెందిన యవకుడుతో వివాహం జరిగింది. వివాహం అనంతరం వధువు తరుపు బందువులు బస్సులో చర్లపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో కొణిజర్ల దగ్గర రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును డీకొన్నది. పెద్దప్రమాదం తప్పిన నప్పటికి బస్సులోని భాస్కర్‌, నరసింహరావు, శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, నీలావతి, అమిత, మణికుమారిలకు స్వలగ్రాయాలు కావడంతో 108 ద్వారా ఖమ్మం తరలించారు. పొలీ్‌సలు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-01-27T04:53:18+05:30 IST