Abn logo
Nov 29 2020 @ 23:40PM

నరక ప్రాయం..!

ఏలూరు–గుడివాకలంక రోడ్డు దుస్థితి

పట్టుతప్పితే  ప్రమాదమే


     (ఏలూరు, ఆంధ్రజ్యోతి) 

గ్రామీణ రహదారుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారవుతోంది.  ఏలూరు మండలంలోని రహదారులే ఇందుకు సాక్ష్యం. ఏలూరు నుంచి కొల్లేరు వెళ్లే రహదారి గోతులమయంగా మారింది. ఇటీవల వరదలతో పాటు నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఈ రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఏలూరు నుంచి గుడివాకలంక వెళ్లే 18 కిలోమీటర్ల దూరంలో రోడ్డు అనేదే కనిపించని పరిస్థితి.  చాటపర్రు నుంచి గుడివాకలంక మధ్య అనేక చోట్ల రోడ్డు కోతకు గురయింది. రోడ్డంతా అడుగు లోతు గోతులు, మెటల్‌తో ప్రాణాంతకంగా తయారయింది. పట్టుతప్పితే ప్రాణాలు కొల్లేటి పా లయ్యే పరిస్థితి ఉంది. ఈ రోడ్డులో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.   రోజు వారీ పనుల కోసం ఏలూరు వచ్చే కొల్లేరు గ్రామాల ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డుకు మరమ్మ తులు చేపట్టాలని కొల్లేరువాసులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement