విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-12-03T03:40:29+05:30 IST

విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలని విద్యాశాఖ ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు పేర్కొన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
మాట్లాడుతున్న ఆర్జేడీ సుబ్బారావు

ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు

కావలిటౌన్‌, డిసెంబరు 2: విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలని విద్యాశాఖ ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న  ప్రైవేట్‌ పాఠశాల సమావేశ మందిరంలో డిప్యూటీ ఈవో రాజా బాలాజీరావు అధ్యక్షతన జరిగిన డివిజన్‌స్థాయి ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఎంఈవోల సమీక్ష సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ పాఠశాలలో ఒక్కరిద్దరు విద్యార్థులు మంచి మార్కులు సాధించడం గొప్ప విషయం కాదని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని కూడా ముందుకు తీసుకొచ్చి పరీక్షలకు సన్నద్ధం చేయడమే భోదకుడి కర్తవ్యమన్నారు. చదువు చెప్పడతోనే బాధ్యత తీరుపోదని, ప్రతి విద్యార్థికి అర్థమైందో లేదో గమనించుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డిక్షనరీలు మూలపడేశారని, వాటిని విద్యార్థులు చదివేవిధంగా కృషి చేయాలన్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ లేకుండానే పాఠశాల నిర్వహణ చేస్తే చర్యలు తప్పవన్నారు. ఉపాధ్యాయులు శెలవులపై ఉన్న శ్రద్ధ పాఠ్యాంశాలు భోదనపై పెట్టాలని చురకలంటించారు. ఈ సమావేశంలో రీజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ మహబూబ్‌ బాషా, హెచ్‌ఎంల సంఘం బాధ్యులు కొండారెడ్డి, కనకరావు, టీవీ రమణ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-03T03:40:29+05:30 IST