Abn logo
Sep 20 2020 @ 04:03AM

పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు దారుణం

 ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

మచిలీపట్నం టౌన్‌: ఒకపక్క కరోనా కష్టాలతో ప్రజలు  ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పేరుతో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచడం దారుణమని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 నెలలుగా వచ్చిన ఆదాయం, ఖర్చులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.


సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చేది రూ.10 అయితే పన్నుల ద్వారా రూ.50 ప్రభుత్వం పిండుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ, టీడీపీ  జిల్లా కార్యదర్శి ఫణికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement