Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కేటింగ్‌ అభివృద్ధికి రింక్‌ల ఏర్పాటు

 నుడా చైర్మన్‌ ముక్కాల

నెల్లూరు (క్రీడలు) డిసెంబరు 8 : జిల్లాలో స్కేటింగ్‌ క్రీడను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చోట స్కేటింగ్‌ రింక్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకనాథ్‌ తెలిపారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు బుధవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్నమయ్య సర్కిల్‌ వద్ద ఉన్న స్పోర్ట్స్‌ థీమ్‌ పార్క్‌లో స్కేటింగ్‌ రింక్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విశాఖలో జరిగిన రాష్ట్రపోటీల్లో సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో కూడా ప్రతిభ చూపాలని కోరారు. డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఆర్‌కె.యతిరాజ్‌ మాట్లాడుతూ ఏసీ స్టేడియంలో కూడా స్కేటింగ్‌ రింక్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అనుమ తులు వచ్చిన వెంటనే  నిర్మాణం చేపడాతమన్నారు. జిల్లా స్కేటింగ్‌ అసోసియేషన్‌ నాయకులు నిమ్మల వీరవెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాకు చెందిన సంజన, వరుణ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీహర్షకుమార్‌రెడ్డి, నిశ్చల్‌, అనన్య, అనుదీప్‌ ఈనెల ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో వివిధ విభాగాల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌  కార్యదర్శి ఈశ్వర్‌, కోచ్‌లు జితేంద్ర, జావేద్‌, భరత్‌, విశ్వనాఽథ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement