Pegasus : అశ్వినీ వైష్ణవ్ వర్సెస్ తృణమూల్ ఎంపీలు

ABN , First Publish Date - 2021-07-22T21:39:46+05:30 IST

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ‘పెగాసస్’ స్పైవేర్ చుట్టూనే తిరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు

Pegasus : అశ్వినీ వైష్ణవ్ వర్సెస్ తృణమూల్ ఎంపీలు

న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ‘పెగాసస్’ స్పైవేర్ చుట్టూనే తిరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా పెగాసస్ వ్యవహారంపై సభలో రగడ చెలరేగింది. పెగాసస్ వ్యవహారంపై సమాధానమివ్వడానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేచి నిలబడగానే, తృణమూల్ కాంగ్రెస్ నేతలు నినాదాలు, నిరసన చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా తృణమూల్‌కు చెందిన ఎంపీ శంతనూ సేన్.. అశ్వినీ వైష్ణవ్‌కు సంబంధించిన పత్రాలను చించేసి, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పైకి విసిరేశారు. దీంతో బీజేపీ, తృణమూల్ సభ్యుల మధ్య మరింత ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో రంగ ప్రవేశం చేసిన మార్షల్స్... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  

మండిపడ్డ మీనాక్షీ లేఖీ

తృణమూల్ వ్యవహార శైలిపై కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సభ్యులు దేశ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు.  రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటూ అత్యంత దిగజారుడుతనంతో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓ కేంద్ర మంత్రి సభలో సమాధానమిస్తున్న సందర్భంలో పేపర్లను చించేయడం ఏంటని మీనాక్షీ లేఖీ దుయ్యబట్టారు. 


Updated Date - 2021-07-22T21:39:46+05:30 IST