Abn logo
May 25 2020 @ 04:57AM

ప్రసవవేదన

 కాన్పుల కోసం తప్పని అవస్థలు

కేవలం 90 బెడ ్లకే పరిమితం

ఒక బెడ్డుపై ఇద్దరు బాలింతలు

200 బెడ్లు, ప్రత్యేక భవనం ప్రతిపాదనలకే పరిమితం

కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) కాన్పుల వార్డులో పరిస్థితి ఇదీ.. 


కడప (సెవెన్‌రోడ్స్‌), మే 24: పెద్దాస్పత్రిగా పేరొందిన రిమ్స్‌ (కడప సర్వజన ఆసుపత్రి)ను పురిటి కష్టాలు పట్టుకున్నాయి. వసతుల లేమితో అవస్థలు పడుతోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, కాన్పుల కోసం వచ్చే వారికి సరైన వసతులు లేవు. ఇటీవల కాన్పుల కేసులు అధికమయ్యాయి. రోజుకు సుమారు 25 నుంచి 30 కాన్పులు చేస్తున్నారు. అందులో 15 నుంచి 18 వరకు సిజేరియన్లు ఉండటం గమనార్హం. ఆస్పత్రిలో కేవలం 90 బెడ్లు మాత్రమే ఉన్నాయి. కాన్పుల కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో బెడ్లు చాలడం లేదు. బెడ ్లను 200కు పెంచమని ఆసుపత్రి వారు ప్రభుత్వానికి ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఉపయోగం లేదు.


ఒక్కో బెడ్డుపై ఇద్దరు బాలింతలకు వైద్యం చేయాల్సి వస్తోంది.  ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల కాన్పుల కోసం వచే ్చ వారితో వారి సహాయకులతో కాన్పుల వార్డు ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. కాన్పులకు సంబంధించి ప్రత్యేక భవనం ఉంటే వైర్‌సకు దూరంగా ఉంచడంతో పాటు సహాయకులు కూడా భౌతికదూరం పాటిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆసుపత్రి భవనంలో ఒక వార్డుగా కాన్పుల వార్డును నెట్టుకొస్తున్నారు. ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేసి బాలింతల బాధలను కొంత వరకు తగ్గించవచ్చు. కాన్పుల వార్డు దీనస్థితిని అధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


కాన్పుల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది ..డాక్టర్‌ లక్ష్మీసుశీల, గైనకాలజీ హెచ్‌ఓడీ

కాన్పుల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో బెడ్లు సరిపోవడం లేదు. బెడ్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టాం. ఆసుపత్రి తరపున, సూపరింటెండెంట్‌ చొరవతో అదనంగా బెడ్లను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాం. ప్రస్తుతం వైరస్‌ అధికంగా ఉండటం, కాన్పులు ఎక్కువగా  ఉండటం వల్ల మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో బెడ్డుపై ఇద్దరు చొప్పున బాలింతలకు సేవలందిస్తున్నాం. ప్రత్యేక భవనం ఉంటే బాగుంటుంది. 


Advertisement
Advertisement
Advertisement