రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-07-06T05:15:06+05:30 IST

రా ష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
రాజాపూర్‌ : పాఠశాలల బంద్‌లో పాల్గొన్న ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు

- విద్యా సంస్థల బంద్‌లో ఏబీవీపీ నాయకులు 

బాదేపల్లి/ రాజాపూర్‌/ దేవరకద్ర, మిడ్జిల్‌, జూలై 5: రా ష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్‌ డిమాండ్‌ చేశారు. మంగళ వారం రాష్ట్ర పిలుపు మేరకు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యం లో పాఠశాలలను బంద్‌ చేయించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పాఠశాలలు తెరచి 25 రోజుల అవుతు న్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు పంపిణీ చేయకపోవడం దురదృష్టకర మ న్నారు. మనఊరు-మనబడి కార్యక్రమానికి కనీసం కార్యాచ రణ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయ కులు కిషోర్‌, మారుతి, శివ, తేజ, సాయి, అరుణ్‌, స్వాతి, పూర్ణ, భాగ్యశ్రీ, అఖిల, రాజేశ్వరి, నాయకులు పాల్గొన్నారు. రాజాపూర్‌ మండలంలోనూ పాఠశా  లలను బంద్‌ చేయించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బాలరాజు, ప్ర శాంత్‌, అనిల్‌, పవన్‌, శ్రీకాంత్‌, ఆకాష్‌, చింటూ, రాఘవేందర్‌ పాల్గొన్నారు.

దేవరకద్రలో ఏబీవీపీ నాయకుడు సాయికుమార్‌ ఆధ్వర్యంలో విద్యా సంస్థలను బంద్‌ చేయించారు. కార్యక్రమంలో నాయకులు రాజేష్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

మిడ్జిల్‌ మండంలో ఏబీవీపీ మండల కార్యదర్శి వడ్డే శేఖర్‌ ఆధ్వర్యంలో పాఠశాలలను మూసివేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ, పవన్‌, రాము, అరవింద్‌, ఖాజా, యాదయ్య ఉన్నారు. 

Updated Date - 2022-07-06T05:15:06+05:30 IST