ఘనంగా నల్లపోచమ్మ బోనాలు

ABN , First Publish Date - 2022-06-27T04:40:36+05:30 IST

చేవెళ్ల మండల కేంద్రంలో నల్లపోచమ్మ బోనాలు

ఘనంగా నల్లపోచమ్మ బోనాలు
చేవెళ్ల మండల కేంద్రంలో బోనాలతో ఆలయానికి వెళ్తున్న మహిళలు

చేవెళ్ల, జూన్‌ 26 : చేవెళ్ల మండల కేంద్రంలో నల్లపోచమ్మ బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాల  ఊరేగింపులో పోతరాజుల విన్యాసం, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు అలరించాయి. అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని భక్తులు మొక్కుకున్నారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, సర్పంచ్‌ బండారు శైలజాఆగిరెడ్డి, మాజీ సర్పంచ్‌ మంగలి నాగమ్మ, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-27T04:40:36+05:30 IST