ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T05:10:52+05:30 IST

రాజంపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు.

ఘనంగా గణతంత్ర వేడుకలు
రాజంపేటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

రాజంపేట, జనవరి 26 : రాజంపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డిలతో పాటు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా రాజంపేట పట్టణంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంఽధిత అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ప్రతా్‌పరాజు, పార్లమెంట్‌ కార్యనిర్వహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యంనాయుడు, పట్టణాధ్యక్షుడు సంజీవరావు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ తుపాకుల అశోక్‌, టీడీపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

పలువురు అధికారులకు ప్రశంసాప్రతాలు : రాజంపేట డివిజన్‌లో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. కొవిడ్‌ సమయంలో ఉత్తమ సేవలు అందించిన రాజంపేట జిల్లా ఉప వైద్య శాఖాధికారి డాక్టర్‌ సానె శేఖర్‌కు సబ్‌కలెక్టర్‌  ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అదే విధంగా అన్ని శాఖల తరపున ప్రతిభకనబరిచిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.  

Updated Date - 2022-01-27T05:10:52+05:30 IST