మినుములూరులో ఘనంగా బారిజం

ABN , First Publish Date - 2021-01-16T05:15:57+05:30 IST

మండలంలోని మినుములూరులో శుక్రవారం బారిజం పండుగను ఘనంగా నిర్వహించారు.

మినుములూరులో ఘనంగా బారిజం
మినుములూరు బారిజం పండుగలో వేషధారులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.


గిరిజన సంప్రదాయంగా ఉత్సవం

పాడేరురూరల్‌, జనవరి 15: మండలంలోని మినుములూరులో శుక్రవారం బారిజం పండుగను ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం మినుములూరులో మూడేళ్లకు ఒకసారి కనుమరోజు ఘనంగా నిర్వహిస్తారు. పండిన పంటలు, ఆయుధాలు(కత్తులు, ఈటెలు, బల్లేలు) తదితర వాటిని గ్రామదేవత వద్ద పెట్టి పూజలను చేస్తారు. పూజలు అనంతరం గ్రామస్థులంతా పొలాల్లోకి చేరుకొని సహపంక్తి భోజనాలు చేసి, థింసా, తదితర నృత్యాలు చేస్తారు. మాజీ సర్పంచ్‌ మినుముల కన్నాపాత్రుడు, గ్రామపెద్దల సమక్షంలో శుక్రవారం జరిగిన బారిజం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, నరసింగరావు దంపతులు, మోదకొండమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T05:15:57+05:30 IST