రేవంత్‌రెడ్డి ఓ దళితద్రోహి

ABN , First Publish Date - 2021-10-20T05:02:08+05:30 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక దళితద్రోహి అని, కేంద్ర ప్రభుత్వం ప్రజాపాలనను మరిచి వ్యాపార రాజకీయాలను ప్రోత్సహిస్తుందని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి ఓ దళితద్రోహి
మాట్లాడుతున్న కమల్‌రాజు

 దేశంలోనే గొప్ప పథకం దళితబంధు 

 వ్యాపార రాజకీయాలు చేస్తున్న బీజేపీ 

 జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజు

చింతకాని అక్టోబరు 19: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక దళితద్రోహి అని, కేంద్ర ప్రభుత్వం ప్రజాపాలనను మరిచి వ్యాపార రాజకీయాలను ప్రోత్సహిస్తుందని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు ఆరోపించారు. మండలంలో దళితబంధు పథకం అమలుకు 100 కోట్ల నిఽధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో వారు పాల్గొన్నారు. సంధర్బంగా 50 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో ఏ నాయకుడు దళితుల అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంత్రణ లేకుండా నిత్యావసరాల ధరలను పెంచుతూ పోతుందని, కార్పోరేట్‌ శక్తులకు ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుందన్నారు. దళితబంధు పథకం ద్వారా ఎటువంటి షరతులు లేకుండా, వంద శాతం సబ్సిడీతో ప్రతి పేద దళితకుటుంబానికి రూ.10 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం అమలుతో దళితుల జీవితాలు మారనున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ పథకాల రూపకల్పనలో సీఎం కేసీఆర్‌కు ఎవరు సాటిరారన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిషోర్‌,ఎంపీపీ పూర్ణయ్య, వైస్‌ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, రైతుబంధు మండల కన్వీనర్‌ కిలారు మనోహర్‌బాబు, జిల్లా సభ్యులు మంకెన రమేష్‌, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి బొడ్డు వెంకటరామయ్య, సొసైటీ చైర్మన్లు కొండపల్లి శేఖర్‌రెడ్డి, నల్లమోతు శేషగిరిరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:02:08+05:30 IST