పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2020-10-01T10:14:57+05:30 IST

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై అధికారులతో సమీక్ష


నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 30 : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్‌ భవనంలో బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  పీవోలు ఎన్నికల్లో టీం లీడర్ల వంటి వారన్నారు. ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, సెక్టోరల్‌ ఆఫీసర్లు తమ అనుమానాలను ఈ శిక్షణలో నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలతో పాటు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ముందుకు వెళ్లా లని సూచించారు. సెక్టోరియల్‌ అధికారికి మూడు నుంచి  నాలుగు పోలిం గ్‌ కేంద్రాలు ఉంటాయని, పోలింగ్‌ కేంద్రం నిర్వహణ బాగుండేలా చూడా లన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మున్సిపాలి టీల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను మున్సిపల్‌ కమిషనర్లు చూస్తారన్నారు. సోమవారం నాటికి పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు సిద్ధంగా ఉండాలన్నారు.


గురువారం నుంచి పోలింగ్‌ కేంద్రాల్లో మాస్‌ బ్యాలెట్‌ పేపర్‌ మీద ఓటరుకు ట్రైనింగ్‌ ఇస్తామన్నారు. పీవోలు పోలింగ్‌ ఏజెం ట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఓటు వేసేవారు మాస్క్‌, గ్లౌజులు ధరిం చాలన్నారు. గత ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ కేవలం ఉద్యోగులకే ఉండేదని, ఈ సారి కొవిడ్‌ పేషెంట్లకు, 65 ఏళ్లు దాటిన వారికి  అనుమతులి చ్చిం దన్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద దగ్గర థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తా రన్నా రు.  ఓటర్లకు నమూనా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నెంబర్లు ఏ విధంగా వే యాలో తెలపాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్‌ ఎంపీడీవో సంజీవ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:14:57+05:30 IST