సింహాద్రి ఎన్టీపీసీ పనితీరుపై సమీక్ష

ABN , First Publish Date - 2021-10-20T05:28:34+05:30 IST

సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ) అధికారులతో మంగళవారం అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సింహాద్రి ఎన్టీపీసీ పనితీరుపై సమీక్ష
సింహాద్రి ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడుతున్న ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి

అధికారులతో చర్చించిన అనకాపల్లి ఎంపీ

పరవాడ, అక్టోబరు 19: సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ) అధికారులతో  మంగళవారం అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో బుధవారం జరగనున్న కోల్‌ అండ్‌ స్టీల్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి ఆమె హాజరవుతారు. ఈ నేపథ్యంలో సింహాద్రిలో జరుగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి, ప్లాంట్‌ పనితీరు గురించి ఆమె సింహాద్రి అధికారులతో చర్చించారు. ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి ఎలాంటి ఢోకాలేదని, విద్యుత్‌ సరఫరాపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని అధికారులు ఎంపీకి వివరించారు. ప్లాంట్‌లో తాత్కాలిక సమస్యలు నెలకొనడం సహజమేనని తెలిపారు. విద్యుత్‌ సరఫరాపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఎంపీ వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే 20 శాతం విద్యుత్‌ వినియోగం అన్ని రంగాల్లో పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సింహాద్రి డీజీఎం రవివర్మ, ఏకె బెహరా పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:28:34+05:30 IST