స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

ABN , First Publish Date - 2021-08-04T05:29:48+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను ఈ ఏడాది కూడా భిన్నంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి నిర్దేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయబద్ధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు: కలెక్టర్‌

కలెక్టరేట్‌, ఆగస్టు 3: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను ఈ ఏడాది కూడా భిన్నంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి నిర్దేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయబద్ధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది కూడా కొవిడ్‌ కారణంగా సాధారణ ప్రజలను వేడుకలకు అనుతించబోమని, స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి లైవ్‌ టెలీకాస్ట్‌ చేస్తామని చెప్పారు. స్టాళ్లు, శకటాలను ఈ ఏడాది రద్దు చేస్తూ వాటికి బదులుగా నవరత్నాలు, వివిధ ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతలను వివరిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలను పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 12లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ దీపికాపాటిల్‌, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, వెంకటరావు, డీఎస్‌వో సచిన్‌ గుప్తా, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవాని శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆ పిల్లలకు పరిహారం 

కొవిడ్‌తో తల్లిదండ్రులు మృతిచెంది, అనాథలుగా మిగిలిపోయిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్‌ సూర్యకుమారి మంగళవారం తన చాంబర్‌లో పిల్లల సంరక్షకులకు అందజేశారు. జిల్లాలో ముగ్గురు బాలలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు చొప్పున రూ.30 లక్షల బాండ్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ రాజేశ్వరి పాల్గొన్నారు.

 7న డీఆర్‌సీ 

జిల్లా సమీక్ష మండలి(డీఆర్‌సీ) సమావేశం ఈనెల 7న జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన  జరగనుందని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక  ప్రకటన విడుదల చేశారు.  ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.  



Updated Date - 2021-08-04T05:29:48+05:30 IST