ఉపాధి హామీ పథకంపై సమీక్ష

ABN , First Publish Date - 2021-04-17T05:02:52+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్ర వారం స్థానిక జిల్లా పరిషత్‌ సభాభవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఉపాధి హామీ పథకంపై సమీక్ష
మాట్లాడుతున్న పీడీ యధుభూషన్‌రెడ్డి

కడప(నాగరాజుపేట), ఏప్రిల్‌ 16: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్ర వారం స్థానిక జిల్లా పరిషత్‌ సభాభవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా పీడీ యధుభూషన్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన 2020- 21 సంవత్సరంలో 147.32 లక్షల కూలీల నిధులు ఉం డగా 149.27 పనిదినాలు కల్పించి లక్ష్యాలను అధిగమించినట్లు తెలిపారు. వేతనాల ఖర్చు రూ.349.15 కోట్లు అని, రూ.351.70 కోట్లు సాధించామన్నారు. సామాగ్రి ఖర్చు రూ.232.76 కోట్లు ఉండగా రూ.287.67 కోట్లు అయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో లక్ష్యాలను అధిగమించామన్నారు. వేసవి కాలంలో అదనపు భత్యం కూలీలకు ఉంటుందన్నారు. సమావేశంలో ఉపాధి హామీ నిఘా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఏపీడీ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:02:52+05:30 IST