కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి మరి..

ABN , First Publish Date - 2020-07-10T20:53:13+05:30 IST

రిటైర్డ్‌ ఎస్‌ఐ అస్వ స్థతతో మృతి చెందారు. కుటుంబసభ్యులు అతనికి తర్లుపాడు రోడ్డులో ని పూలసుబ్బయ్య కాలనీ సమీపంలో వారి నివాస స్థలంలో

కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి మరి..

ఇంటి స్థలంలో రిటైర్డ్‌ ఎస్సై మృతదేహం ఖననం 

అభ్యంతరం తెలిపిన స్థానికులు

బయటకు తీసినవైనం

తరలించేందుకు అంగీకరించని కుటుంబసభ్యులు

మున్సిపల్‌ కార్మికులకు అప్పగింత


మార్కాపురం(ప్రకాశం జిల్లా): రిటైర్డ్‌ ఎస్‌ఐ అస్వ స్థతతో మృతి చెందారు. కుటుంబసభ్యులు అతనికి తర్లుపాడు రోడ్డులో ని పూలసుబ్బయ్య కాలనీ సమీపంలో వారి నివాస స్థలంలో  మృత దేహాన్ని ఖననం చేశారు. దీనిపై స్థానికులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఏమి జరుగుతుందోనని గురువారం ఉదయం నుంచి రాత్రి వర కూ పట్టణంలో ఉత్కంఠత నెలకొంది. ఎట్టకేలకు మృత దేహాన్ని అక్కడ నుంచి తొలగించి కుటుంబసభ్యులు రాక పోవడంతో మున్సిపల్‌ సిబ్బం దికి అప్పగించారు. పట్ట ణంలో నివాసముంటున్న రిటైర్‌ ఎస్‌ఐ రమణయ్య(62) బుధవారం రాత్రి  మృతిచెందారు.


ఆయన మృతదేహాన్ని కుమారుడు తర్లుపాడు రోడ్డులోని పూల సుబ్బయ్య కాలనీ సమీపంలోని ఆయన నివాస స్థలంలో గురువారం పూడ్చేందుకు సన్నా హాలు చేశారు. దానిపై స్థానికులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  పోలీసుల రాకను గమనించి పూడ్చే కార్యక్రమాన్ని  ఆపేశారు.  దీనిపై స్థానికులు ఆర్డీవో శేషిరెడ్డికి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని అక్కడ నుంచి తొలగించాలని ఆయన ఆదే శించారు. దీంతో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి శ్మశాన వాటికలో ఖననం చేయాలని అధికారులు కుటుంబ సభ్యులకు సూచించారు. కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో తహసీల్దార్‌  రమేష్‌ మృతదేహాన్ని వెలికి తీయించి మున్సిపల్‌ సిబ్బందికి అప్పగించారు. వారు మృతదేహాన్ని గుండ్లకమ్మ నది ఒడ్డున ఖననం చేశారు.

Updated Date - 2020-07-10T20:53:13+05:30 IST