‘ఫీజు బకాయిల విషయంలో పునరాలోచించాలి’

ABN , First Publish Date - 2020-06-06T10:55:14+05:30 IST

డిగ్రీ మొదటి సంవత్సరం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తీసుకుంటామని చెప్పడంతో ఫలక్‌నుమా డిగ్రీ కళాశాలలో

‘ఫీజు బకాయిల విషయంలో పునరాలోచించాలి’

మదీన,జూన్‌ 5(ఆంధ్రజ్యోతి) : డిగ్రీ మొదటి సంవత్సరం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తీసుకుంటామని చెప్పడంతో ఫలక్‌నుమా డిగ్రీ కళాశాలలో విద్యార్థులు శుక్రవారం నిరసనకు దిగారు. ఫలక్‌నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు సంబంధించి డిసెంబర్‌లో సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. చాలా మంది మొదటి సంవత్సరం ఫీజులు పూర్తిగా చెల్లించలేదు.


సప్లిమెంటరీ ఫీజు డేట్‌ రావడంతో కళాశాలలో మొదటి సంవత్సరం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సప్లిమెంటరీ ఫీజు కట్టించుకుంటామని కళాశాలలో తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. లాక్‌డౌన్‌ నేపద్యంలో చాలా ఇబ్బందిగా ఉందని, ఈ సమయంలో బకాయిలు చెల్లించమంటే ఎలా చెల్లిస్తామని  వారు ప్రశ్నించారు. ఈ విషయంలో ఉస్మానియా యునివర్శిటీ, విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని కోరారు. 

Updated Date - 2020-06-06T10:55:14+05:30 IST