అన్ని పోలీసు కార్యాలయాల్లో ‘స్పందన’

ABN , First Publish Date - 2021-10-20T05:49:51+05:30 IST

జిల్లాలో డీఎస్పీ, సర్కిల్‌, పోలీస్‌స్టేషన్‌లలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ మలికగర్గ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్ని పోలీసు కార్యాలయాల్లో ‘స్పందన’

ఎస్పీ మలికగర్గ్‌ 


ఒంగోలు(క్రైం), అక్టోబరు 19 : జిల్లాలో డీఎస్పీ, సర్కిల్‌, పోలీస్‌స్టేషన్‌లలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ మలికగర్గ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు ఫిర్యా దుదారులు వ్యయప్రయాసలతో రానవసరం లేదన్నారు. అన్నీ పోలీస్‌ కార్యాలయా లలో ఫిర్యాదులను పోలీసు అధికారులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అన్ని ఫిర్యాదు లకు నిర్ణిత కాలంలో చట్టపరిధిలో పరిష్కారం చేస్తామని, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్వహరిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ అవకాశా న్ని ఫిర్యాదుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Updated Date - 2021-10-20T05:49:51+05:30 IST