Visvesvaraya Instituteలో పరిశోధన

ABN , First Publish Date - 2022-06-30T20:52:08+05:30 IST

నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఎన్‌ఐటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడవు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫుల్‌ టైం, పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌లు

Visvesvaraya Instituteలో పరిశోధన

నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఎన్‌ఐటీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడవు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫుల్‌ టైం, పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. నిర్దేశిత జాతీయ పరీక్ష స్కోర్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 


విభాగాలు: అప్లయిడ్‌ మెకానిక్స్‌, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, వీఎల్‌ఎ్‌సఐ అండ్‌ నానోటెక్నాలజీ.

అర్హత: ఇంజనీరింగ్‌ విభాగాలకు సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ/ ఎంటెక్‌; ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ విభాగాలకు ఎంఈ/ ఎంటెక్‌/ ఎం ఆర్క్‌/ ఎం ప్లాన్‌ /ఎం డిజైన్‌/ ఎంసీపీ; హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, సైన్సెస్‌ విభాగాలకు హ్యుమానిటీస్‌/  బేసిక్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఎంఏ/ఎంబీఏ-హెచ్‌ఆర్‌/ ఎమ్మెస్సీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ఏఎంఐఈటీఈ/ బీఎస్సీ ఇంజనీరింగ్‌/బీ ప్లాన్‌/ బీటెక్‌ ప్లాన్‌ ఉత్తీర్ణులు కూడా సం బంధిత విభాగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు.  నెట్‌ / గేట్‌/ జీప్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌, డీఎస్‌టీ ఇన్‌స్పయిర్‌/ సీఎ్‌సఐఆర్‌/యూజీసీ ఫెలోషిప్‌ అర్హత తప్పనిసరి. పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌లో చేరాలంటే గేట్‌ అభ్యర్థులకు అయిదేళ్లు, నాన్‌ గేట్‌ అభ్యర్థులకు పదిహేనేళ్ల పారిశ్రామిక/ రిసెర్చ్‌/ అకడమిక్‌ అనుభవం ఉండాలి. 

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. దీని ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి రాత పరీక్ష స్కోర్‌కు 40 శాతం, జాతీయ పరీక్ష స్కోర్‌కు 40 శాతం, ఇంటర్వ్యూకి 20 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పార్ట్‌ టైం ప్రోగ్రామ్‌లో చేరేవారికి రాతపరీక్షకు 60 శాతం, ఇంటర్వ్యూకి 40 శాతం వెయిటేజీ ఇస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 5 

రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: జూలై 8

రాత పరీక్ష తేదీ: జూలై 20

ఇంటర్వ్యూలు: జూలై 20, 21

ప్రవేశాలు పొందిన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: జూలై 25

అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌: ఆగస్టు 1 నుంచి 5 వరకు

వెబ్‌సైట్‌: www.vnit.ac.in

Updated Date - 2022-06-30T20:52:08+05:30 IST