smugglers నుంచి కంగారూల స్వాధీనం...బెంగాల్ సఫారీ పార్కుకు తరలింపు

ABN , First Publish Date - 2022-04-04T16:34:11+05:30 IST

కంగారూలను అక్రమంగా తరలిస్తుండగా పశ్చిమబెంగాల్ పోలీసులు వాటిని పట్టుకొని నిందితులను అరెస్ట్ చేశారు....

smugglers నుంచి కంగారూల స్వాధీనం...బెంగాల్ సఫారీ పార్కుకు తరలింపు

సిలిగురి(పశ్చిమబెంగాల్): కంగారూలను అక్రమంగా తరలిస్తుండగా పశ్చిమబెంగాల్ పోలీసులు వాటిని పట్టుకొని నిందితులను అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్ దువార్ జిల్లాలో బెంగాల్-అసోం సరిహద్దుకు సమీపంలో 31వ నంబర్ జాతీయ రహదారిపై ఇద్దరు స్మగ్లర్లు 4 కంగారూలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాటిలో ఒక కంగారూ మరణించగా మరో 3 కంగారూలు గాయపడ్డాయి. ఈ కంగారూలు గాయాలతో పాటు బలహీనంగా, పోషకాహార లోపంతో ఉన్నాయని గురించిన పశువైద్యుల బృందం వాటికి చికిత్స అందిస్తోంది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కంగారూలను శాశ్వతంగా సిలిగురిలోని బెంగాల్ సఫారీ పార్కుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.


Updated Date - 2022-04-04T16:34:11+05:30 IST