Abn logo
Jan 27 2021 @ 00:53AM

ఘనంగా గణతంత్ర వేడుకలు

బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జాతీయజెండాను ఎగురవేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జనవరి 26: బనగానపల్లె పట్టణంలోని  టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి జాతీయజెండాను ఎగురవేసి గణతంత్రవేడుకల్లో పాల్గొన్నారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్డులో జడ్జి రాకేశ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దారు ఆల్‌ఫ్రెడ్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాగప్రసాద్‌,  గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ స్పెషల్‌ అధికారి శివరామయ్య, జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని జాతీయ జెండాకు వందనం గావించారు. సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐలు కృష్ణమూర్తి, మహేశ్‌లు, నందివర్గం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి, నెహ్రూ ఉన్నతపాఠశాల, సీపీఎస్‌సీ పాఠశాలల్లో  కరస్పాండెంట్‌ కోడూరు హరినాథరెడ్డి, హెచ్‌ఎం. కమల్‌తేజారెడ్డి, డైరక్టర్‌ రవితేజారెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో స్వరూప, స్థానిక బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం పద్మావతి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శంకర్‌నాయక్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం గురుస్వామి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణలత, ఎస్వీ డిగ్రీ క ళాశాలలో మునిస్వామిరెడ్డి, కంకర గుర్రెడ్డి కళాశాలలో కరస్పాండెంట్‌ రామచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్‌ సదాశివమూర్తి, హరిహర జూనియర్‌ క ళాశాలలో సురేష్‌కుమార్‌, సాయిసిద్ధార్ధ జూనియర్‌ కళాశాలలో కరస్పాండెంట్‌ మునిరెడ్డి, రాజశేఖర్‌, బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం దస్తగిరి, ఆయుర్వేద ఆస్పత్రిలో డాక్టర్‌ నాగరాజు, బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుజాత, టంగుటూరు వైద్యశాలలలో డాక్టర్‌ శివశంకరుడు, సిబ్బంది, పశువైద్యశాలలో ఏడీ వెంకటరమణవర్మ, వ్యవసాయాధికారి కార్యాలయంలో వ్యవసాయాధికారి విజయకుమార్‌, పెన్షనర్ల అసోసియేషన్‌ కార్యాలయంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు సంజీవ రెడ్డి, గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి రాఘవరెడ్డి, సీడీపీవో కార్యాల యంలో  సీడీపీవో పద్మావతి, బనగానపల్లె పట్టణంలోని హాస్టళ్లలో వై.వీ.సు బ్బారెడ్డి, విజయలక్ష్మి, చైతన్యలక్ష్మి, వేణుగోపాల్‌, రఫీ, విద్యావతి జెండాను ఆవిష్కరించారు. కోర్టు ఆవరణలో జడ్జి రాజేష్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో ఏఈ సాయికృష్ణ, సర్కిల్‌స్టేషన్‌లో సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌  సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఆదినారాయణ, ఆర్టీసీ డిపోలో డీఎం శ్రీనివాసులు, మైనింగ్‌ కార్యాలయంలో ఏడీ వేణుగోపాల్‌ జాతీయజెండాను ఎగురవేశారు.


ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని కోర్టులో ఐదో  అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా జాతీయ జెండాను ఎగుర వేశారు డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ రాజేంద్ర, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ రాజశేఖరరెడ్డి, పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ సుబ్రహ్మణ్యం, పోస్టాఫీసులో ఐపీవో మౌళీశ్వరరెడ్డి, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ వరప్రసాదు, మున్సిపాల్టీ కార్యాలయంలో కమీషనర్‌ రమేష్‌బాబు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అక్రమ్‌బాషా, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో శోభావివేకవతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో డీఈ రమేష్‌కుమార్‌, కేసీ కార్యాలయంలో డీఈ బాస్కరరావు, ఎంఐ కార్యాలయంలో డీఈ రామకృష్ణారెడ్డి, పీఆర్‌ కార్యాలయంలో డీఈ నరసింహారావు, ఆర్టీసీ డిపోలో డీఎం రాజశేఖరరెడ్డి, ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవో జ్యోత్స్న, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో వర్మ, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలు ఉమాదేవి, వ్యవసాయ మార్కెట్‌ కమిటిలో కార్యదర్శి జయప్రకాశ్‌రెడ్డి, వెలుగు కార్యాలయంలో కో-ఆర్డినేటర్‌ దానం, కేడీసీసీ బ్యాంకులో సూపర్‌వైజర్‌ ప్రతాపరెడ్డి, హౌసింగ్‌ కార్యాలయంలో ఏఈ రమణారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు. వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరెడ్డి, ఉన్నత పాఠశాలలో మోహన్‌ జాతీయ జెండాను ఎగుర వేశారు. బాలయోగి పాఠశాలలో ప్రిన్సిపాల్‌ ప్రసన్నకుమారి, గిరిజన బాలుర పాఠశాలలో ప్రిన్సిపాల్‌ సాగర్‌, మండలంలోని కోటకందుకూరు కస్తూరిబా, మోడల్‌, ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంలు జాతీయ జెండాను ఎగుర వేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. 


నంద్యాల: రాజ్యాంగాన్ని గౌరవించి రైతు వ్యతిరేక  చట్టాలను రద్దు చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ నాయకుడు అబ్దుల్‌ సమ్మద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్‌డీపీఐ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణను చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ సమ్మద్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగధనులు తమ మాన ప్రాణాలను త్యాగం చేశారని, ఆ త్యాగ ఫలాలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

 

పాణ్యం: పాణ్యం పోలీసు స్టేషన్‌ వద్ద సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు, ఎస్‌ఐ రాకేష్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎంపిడీఓ దస్తగిరి, తహశీల్దారు రత్నరాధిక, పంచాయతీ కార్యదర్శి అనూరాధ, ఎంఏఓ ఉషారాణి, ఎంఈఓ కోటయ్య తమ కార్యాలయాల వద్ద జెండా ఎగురవేశారు. గిరిజన గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్‌ మేరీ సలోమి, ఎంఎంఎస్‌ కార్యాలయం వద్ద ఏపీఎం శేఖర్‌, ఆర్జీఎం, శాంతిరాం, ఫార్మసీ కళాశాలల వద్ద శాంతిరాముడు పతాకావిష్కరణ చేశారు.  గిరిజన గురుకుల బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాల, కస్తూర్బా, మోడల్‌ పాఠశాల వద్ద ప్రిన్సిపాళ్లు అరుణాదేవి, రత్నమ్మ, లలితాకుమారి, దినేష్‌బాబు, గ్రంఽథాలయం వద్ద లైబ్రేరియన్‌ వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఎగురవేశారు. కెడీసీసీ బ్యాంకు వద్ద మేనేజరు నాగమద్దిలేటి, మాలమహానాడు, సీపీఎం, డీవైయఫ్‌ఐల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేసి నివాళులర్పించారు.  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ మురళీధర్‌, ప్రభుత్వ ఉన్నన పాఠశాలలో హెచ్‌ఎం జిలానీ జెండా ఆవిష్కరించారు.


 శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం కార్యాలయం పరిపాలనా భవనం ప్రాంగణంలో ఈవో కేఎస్‌ రామరావు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు.

 

నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డి మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ రూపలత,  వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఏడీఏ వీరారెడ్డి, ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగసునీతారాణి, పోలీస్‌సర్కిల్‌ కార్యాలయంలో సీఐలు నాగరాజారావు, ప్రసాద్‌, హంద్రీనీవా డివిజన్‌ కార్యాలయంలో ఈఈ రెడ్డిశేఖరరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.


ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, న్యాయస్థానంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజేంద్రబాబు, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శృతి, అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో ఆశాకిరణ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, పోలీసుస్టేషన్‌లో సీఐ బీఆర్‌ కృష్ణయ్య, ఎక్సైజ్‌ కార్యాలయంలో సీఐ రామాంజనేయులు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మోహన్‌కుమార్‌, ఎంఆర్‌సీలో మండల విద్యాశాఖాధికారి జానకీరామ్‌, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ వెంకటదాసు, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏవో విష్ణువర్థన్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ కార్యాలయంలో ఏడీ భవానీశంకర్‌రెడ్డి, మదరసాలో బంగారు దుకాణాల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏం.రషీద్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లత, జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రఘురామాచార్యులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సక్రూనాయక్‌, ప్రభుత్వ వైద్యశాలలో వెంకటరమణ, ఆర్టీసీ డిపోలో మేనేజర్‌ కృష్ణమూర్తి, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెయిన్‌ బ్రాంచ్‌లో మేనేజర్‌ సురేష్‌, అగ్నిమాపక కేంద్రంలో ఫైర్‌ ఆఫీసర్‌ భీముడునాయక్‌ త్రివర్ణపతాకాలను ఎగురవేశారు. 


Advertisement
Advertisement
Advertisement