వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2021-01-27T04:24:21+05:30 IST

గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు
జెండా వందనం చేస్తున్న ఆర్డీవో సువర్ణమ్మ

ఆత్మకూరు, జనవరి 26: గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతిగృహాల్లో జెండా ఎగురవేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జి.సువర్ణమ్మ వీఆర్‌వోలతో కలిసి జెండా ఆవిష్కరించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఎం రమే్‌షబాబు, ఎమ్మెల్యే కార్యాలయంలో వైసీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ అల్లారెడ్డి ఆనందరెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయంలో డీఈ శ్రీనివాసరావు, ఏబీసీడబ్ల్యూవో కార్యాలయంలో బీసీ సహాయసంక్షేమాధికారి ఎం.శ్రీదేవి జెండా ఆవిష్కరించారు. తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి తహసీల్దారు సుభద్ర పూలమాల వేసి నివాళులర్పించారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసుస్టేషన్‌లో సీఐ సోమయ్య, ఎంిపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కోరా రాఘవేంద్ర, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో నజీర్‌బాషా, ఇంజనీరింగ్‌ కళాశాలలో కరస్పాండెంట్‌ యు వసంత్‌ జెండా ఆవిష్కరించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో, సబ్‌జైల్‌లో, అటవీశాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్‌శాఖ, ఆర్టీసీ డిపో, అగ్నిమాపక కేంద్రం, అన్ని సచివాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మువ్వెన్నల జెండాను ఎగురవేశారు. మండలంలోని ప్రాథమిక, ఉన్నత, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ వసతిగృహాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు.

కావలిటౌన్‌ : కావలి ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఆర్డీవో జీ శ్రీనివాసులు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కావలి తహసీల్దారు శ్రీరామకృష్ణ, ఏవో శ్రీనివాసులు, డివిజన్‌ సర్వేయర్‌ ఆర్‌.శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. నేతలు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, కనమర్లపూడి నారాయణ, జగదీష్‌రెడ్డి, కుందుర్తి కామయ్య, అమర వేదగిరి, తిరివీది ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు జెండా ఆవిష్కరించగా రెడ్‌క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సీఎల్‌ఎన్‌ రెడ్డి, ప్రాట్రన్స్‌ కమిటీ సభ్యులు మన్నెమాల గోవిందరెడ్డి, రెడ్‌క్రాస్‌ బాధ్యులు రవిప్రకాష్‌, దామిశెట్టి సుధీర్‌నాయుడు, గంధం ప్రసన్నాంజనేయులు, ఇలీంద్ర వెంకటేశ్వర్లు, కనమర్లపూడి నారాయణ, అమర వేదగిరి, తిరివీధి ప్రసాద్‌, తన్నీరు మాల్యాద్రి, పార్వతి శంకర్‌, షమ రహీం, నంద తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ బీ.శివారెడ్డి జెండావందనం చేయగా మున్సిపల్‌ డీఈ శ్రీనివాసులు, టీపీవో దశయ్య, ఆర్వో శేఖర్‌ పాల్గొన్నారు.

కావలి రూరల్‌ : కావలి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రసాద్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు శ్రీరామక్రిష్ణ, ఎమ్పీడీవో కార్యాలయంలో ఏవో శ్రీధర్‌, 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ కొండయ్య, 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ అరుణకుమారి, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐలు మాల్యాద్రి, ప్రతాప్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యాక్రమాల్లో  ఆర్‌ఐలు, వీఆర్వోలు, ఎమ్పీడీవో కార్యాలయ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఉదయగిరి : మండలంలోని ఎంపీడీవో, వ్యవసాయశాఖ, ఐసీడీఎస్‌, రెవెన్యూ, కోర్టు, ఆర్టీసీ డిపో, గ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాల, సచివాలయాలు తదితర కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జెండా ఎగురవేశారు. డిగ్రీ, జూనియర్‌ కళాశాల, మెరిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేసి, విద్యార్థులకు బహుమతులు అందచేశారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ప్రత్యేకంగా అకర్షించారు. మానవహారాలు ఏర్పాటు చేశారు. ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయడు భిక్షాలతో కలిసి పాఠశాల చైర్మన్‌ షాకీరాబేగం, వైస్‌ చైర్మన్‌ రత్తయ్య విద్యార్థులకు బహమతులు ప్రదానం అంద చేశారు. 

అల్లూరు : స్థానిక పోలీసు స్టేషనులో ఎస్‌ఐ బలరామయ్య, పంచాయతీ కార్యాలయంలో ఇన్‌చార్జి కమిషనర్‌ శివారెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. 






Updated Date - 2021-01-27T04:24:21+05:30 IST