గణతంత్ర సంబరం

ABN , First Publish Date - 2021-01-27T06:20:37+05:30 IST

నగరంలోని ప్రభుత్వ, వివిధ పార్టీ కార్యాలయాలు, ప్రజా, కుల సంఘాల కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

గణతంత్ర సంబరం
కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద జెండా ఎగురవేస్తున్న డీసీసీ అధ్యక్షుడు

కర్నూలు(న్యూసిటీ), జనవరి 26: నగరంలోని ప్రభుత్వ, వివిధ పార్టీ కార్యాలయాలు, ప్రజా, కుల సంఘాల కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీ కార్యాలయంలో సీఈవో ఎం.వెంకటసబ్బయ్య, కార్మిక శాఖ కార్యాలయంలో ఉపకమిషనర్‌ ఎన్‌.శేషగిరిరావు జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ సీఈవో టీవి.భాస్కర్‌నాయుడు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ శివశంకర్‌ పాల్గొన్నారు. డా.బీఆర్‌.అంబేడ్కర్‌ స్వచ్ఛభారత్‌ రచ్చబండ సేవాసమితి ఆధ్వర్యంలో పాతబస్టాండులోని డా.బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి అధ్యక్షుడు శ్రీనివాసులు, వాణి పుల్లయ్య పూలమాలలు వేశారు. బుట్టాఫౌండేషన్‌ కార్యాలయంలో మహత్మాగాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు మేనేజర్‌ బి.రాజేష్‌, మదన్‌మోహన్‌, హేమలత పూలమాలలు వేశారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మన్సూర్‌ బాషా జెండాను ఆవిష్కరించారు. 


 కర్నూలు(అర్బన్‌): జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు అహ్మద్‌ ఆలీఖాన్‌ జెండా ఎగుర వేశారు. అంతకుముంద పార్టీ కార్యాలయం నుంచి నాయకులతో ర్యాలీగా వెళ్లి కొండారెడ్డి బురుజు వద్ద గల గాంధీ విగ్ర హానికి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు, పీసీసీ అధికార ప్రతినిధి కరుణాకర్‌ బాబు, నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌ పాల్గొన్నారు.

 ఆర్‌యూలోని ఓపెన్‌ ఎయిర్‌ ముందు ఉపకులపతి ఏ. ఆనందరావు జెండా ఎగుర వేశారు. రెక్టార్‌ విశ్వనాథరెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకట సుందరానంద పుచ్చా, ప్రిన్సిపాళ్లు మధుసూదన వర్మ, నరసింహులు, హరి ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్లు ఎన్‌టికే నాయక్‌, శ్రీనివాసచార్య, ఎంఈ.రాణి పాల్గొన్నారు. ఉర్దూ యూనివర్సిటీలో జాతీయ జెండాను ఉపకులపతి ముజఫర్‌ ఆలీ ఎగురవేశారు. రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ బాయినేని శ్రీనివాసులు పాల్గొన్నారు. బిర్లా కాంపౌడ్‌ వద్ద ఉన్న ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఎస్‌ఈ జయరామిరెడ్డి జెండా ఎగురవేశారు. డీఈ శ్రీనివాసులు, ఈఈలు పాల్గొన్నారు. నగర పాలికలో కమిషనర్‌ బాలాజీ జెండాను ఎగుర వేశారు. అదనపు కమిషనర్‌ పీవీ. రామలింగేశ్వరరావు, మేనేజర్‌ చిన్నరాముడు, హెల్త్‌ ఆఫీసర్‌ భాస్కరరరెడ్డి, ఎస్‌ఈ. సురేంద్రబాబు పాల్గొన్నారు.


కర్నూలు: డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ క్యాంప్‌ ఆఫీసులో ఎస్పీ ఫక్కీరప్ప, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అడిషినల్‌ ఎస్పీ గౌతమి సాలి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ రాధాక్రిష్ణ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీలు వెంకటాద్రి, మహేశ్వరరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు పవన్‌ కిషోర్‌, రామక్రిష్ణ, డీపీవో ఏవో సురే్‌షబాబు, డీఐజీ మేనేజర్‌ రత్నప్రకాష్‌, డీఐజీ పీఏ అశోక్‌కుమార్‌, ఎస్పీ పీఏ నాగరాజు పాల్గొన్నారు. 


కర్నూలు(ఎడ్యుకేషన్‌):  కేశవరెడ్డి పాఠశాలల్లో గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.కేశవరెడ్డి హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. 

 మాంటిస్సోరి, ఇండస్‌ పాఠశాలలో జాతీయ జెండాను విద్యాసంస్థల అధినేత రాజశేఖర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇండస్‌ పాఠశాల సీబీఎ్‌సఈ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి విల్సన్‌, అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్‌ రిపబ్లిక్‌ డే విశిష్టతను వివరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

 రవీంద్ర డిగ్రీ కళాశాలలో జాతీయ జెండాను విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య, రవీంద్ర విద్యానికేతన్‌ పాఠశాలలో డా.మమతా మోహన్‌ జెం డాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్‌ మోహన్‌ కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వంశీధర్‌, గోపినాథ్‌ పాల్గొన్నారు. 

 మాధవీ నగర్‌ రవీంద్ర ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల, రెవెన్యూ కాలనీలోని రవీంద్ర టాలెంట్‌ పాఠశాలలో కరస్పాండెంట్‌ పీబీవీ సుబ్బయ్య జెండాను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్‌ పి.ప్రదీప్‌ కుమార్‌, వైస్‌ప్రిన్సిపాల్‌ శారద పాల్గొన్నారు. 

 బీ.క్యాంపు ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ సతీష్‌ చంద్ర జెండాను ఆవిష్కరించారు. 

 బీజేపీ జిల్లా కార్యాలయంలో జెండాను జిల్లా అధ్యక్షుడు రామస్వామి ఆవిష్కరించారు. నాయకులు కపిలేశ్వరయ్య, ఎస్‌.రంగస్వామి పాల్గొన్నారు. కల్లూరులోని బీజేపీ కార్యాలయంలో జీఎస్‌ నాగరాజు, డా.కొట్టె చెన్నయ్య, వెంకటేశ్వరరెడ్డి జెండాను ఆవిష్కరించారు. 


కర్నూలు(కల్చరల్‌): జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో కార్యదర్శి సి. శ్రీనివాసరెడ్డి జెండాను ఆవిష్కరించారు. గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కేజీ గంగాధర్‌రెడ్డి, డాక్టర్‌ కేజీ శరత్‌చంద్ర, జిల్లా కేంద్ర గ్రంథాలయం డిప్యూటీ లైబ్రేరియన్‌ వి. సుబ్బరత్నమ్మ పాల్గొన్నారు. 

 కొత్తపేటలోని స్వాతంత్య్ర సమరయోధుడు, దింవగత సండేల్‌ నారాయణ రావు స్వగృహం వద్ద మంగళవారం ఆయన కుమారులు సండేల్‌ నరేంద్ర ప్రసాద్‌, చంద్రశేఖర్‌ జెండాను ఆవిష్కరించారు.


కర్నూలు(లీగల్‌): జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీ.రాధాకృష్ణ కృపాసాగర్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి బి.శ్యాంసుందర్‌, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యవతి, ఇతర న్యాయమూర్తులు చిన్నబాబు, శ్రీనివాసరావు, కేశవ్‌, ఏ.పద్మ, సత్యలక్ష్మిప్రసన్న, ఎంవీఎన్‌ పద్మజ, షర్మిల, భార్గవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌బాబు, ప్రధాన కార్యదర్శి గోపాలక్రిష్ణయ్య, గవర్నమెంట్‌ ఫ్లీడర్లు పాల్గొన్నారు.

 జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫోరం అధ్యక్షురాలు ఎస్‌.నజీరున్నీసా జెండాను ఎగురవేశారు. ప్రసూనా న్యాయ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డా.ఎం.శివాజిరావు జెండాను ఎగురవేశారు. పాతబస్టాండులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏపీ ఎస్సీ, ఎస్టీ లాయర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్‌ న్యాయవాది వై.జయరాజు జెండాను ఎగురవేశారు. 


కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ డా.పీఎన్‌ జిక్కి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిశోధనకు సెలక్టు అయిన ఎంబీబీఎస్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని పి.నమ్రతకు ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌ ప్రశంసాపత్రాన్ని అందించారు. 

 కర్నూలు జీజీహెచ్‌లో సూపరింటెండెంట్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కరోనా సమయంలో విశేష సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.సి.ప్రభాకర్‌ రెడ్డి, డా.కె.నరసింహులు, సీఎ్‌సఆర్‌ఎంవో డా.హేమనళిని, ఏడీ రమేష్‌ పాల్గొన్నారు.


కర్నూలు(స్పోర్ట్స్‌): మాజీ సైనికుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. ప్రెసిడెంట్‌ నర్ర పేరయ్య, జనరల్‌ సెక్రటరీ బాలకృష్ణ, ట్రెజరర్‌ నారాయణ, రాజశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.


డోన్‌: పట్టణంలోని కోర్టు ఆవరణలో జడ్జి షియాజ్‌ ఖాన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, డీఎస్పీ కార్యాలయ ఆవరణలో డీఎస్పీ నరసింహారెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కేఎల్‌ఎన్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. వైష్ణవి డిగ్రీ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కొవిడ్‌ పరిస్థితుల్లో సేవలు అందించిన తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, సీఐ సుబ్రహ్మణ్యం, డా. బాలచంద్రారెడ్డి, డా.సుంకన్నలను సన్మానించారు. 


డోన్‌(రూరల్‌): వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ ఏడీఏ అశోక్‌వర్దన్‌ రెడ్డి, ఎంఈవో కార్యాలయం వద్ద మండల విద్యాధికారి ప్రభాకర్‌, వైఎస్సార్‌ క్రాంతిపథం కార్యాలయం వద్ద ఏపీఎం చంద్రకళ, ఏసీ మల్లికార్జున, జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం వెంకటసుబ్బారెడ్డి జెండాను ఎగురవేశారు. 


బేతంచెర్ల: పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు విద్యాసాగర్‌, పోలీ్‌సస్టేషన్‌లో సీఐ పీటీ కేశవరెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అశ్వినికుమార్‌, ప్రభుత్వ శేషారెడ్డి ఆస్పత్రిలో డాక్టర్‌ నాగరాణి, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఏడీ గురుదివాకర్‌రెడ్డి, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ర్టార్‌ అబ్ధుల్‌ ఫైరోజ్‌ జెండాను ఆవిష్కరించారు. 


కోడుమూరు: తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఉమామహే శ్వరమ్మ, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో మంజులవాణి, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ మల్లికార్జున, టీబీపీ ఆఫీసులో డీఈఈ వెంకటరమణ, ఆర్‌డ బ్ల్యూఎస్‌ కార్యాలయంలో డీఈఈ నాగేశ్వరరావు జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హెచ్‌ఎంలు జెండాను ఆవిష్కరించారు. 


గూడూరు: నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో కమిషనర్‌ పవన్‌ కుమార్‌ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా.జె.సుధాకర్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అస్లాం, ఎల్‌.వెంకటేశ్వర్లు, సుభాకర్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో మాధవీలత, గూడూరు పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ నాగార్జున జెండాను ఆవిష్కరించారు. 


పత్తికొండటౌన్‌: వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య జెండాను ఎగురవేశారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, పోలీ్‌సస్టేషన్‌లో సీఐ ఆదినారాయణరెడ్డి, మోడల్‌స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, సబ్‌జైల్‌లో జైలర్‌ చంద్రమోహన్‌ జెండాను ఎగురవేశారు. 


Updated Date - 2021-01-27T06:20:37+05:30 IST