Abn logo
Jun 13 2021 @ 23:23PM

గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలి

 ఎమ్మెల్యే రఘునందన్‌రావు 

 వల్లభాపూర్‌ పంచాయతీ భవనానికి  స్థల సేకరణ కోసం రూ.2 లక్షలు అందజేత


చేగుంట, జూన్‌ 13: పార్టీలకతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. నార్సింగి మండలం వల్లభాపూర్‌ పంచాయతీ భవన నిర్మాణానికి స్థల సేకరణ కోసం ఎమ్మెల్యే తన సొంత నిధులు రూ.2లక్షల చెక్కును సర్పంచ్‌ నేనావత్‌ గీతకు ఆదివారం చేగుంటలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.20 లక్షలు మంజూరై నెలలు గడుస్తున్నా స్థలం లేక ముందుకు సాగకపోవడం విచారకరమన్నారు. స్థల సేకరణ కోసం తాను సహకరిస్తానని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నార్సింగి, చేగుంట మండలాల బీజేపీ అధ్యక్షులు మహంకాళి, భూపాల్‌, ఎంపీటీసీ శంభుని రవి, నాయకులు గోవింద్‌, స్వామి, రాజగోపాల్‌, బాల చంద్రం, సర్పంచ్‌ ఎల్లారెడ్డి, సంతో్‌షరెడ్డి పాల్గొన్నారు.