ఆర్‌అండ్‌బీ రోడ్డుకు చందాలతో మరమ్మతులు

ABN , First Publish Date - 2022-06-26T07:18:37+05:30 IST

‘అది పుల్లలచెరువు- వినుకొండకు వెళే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రోడ్డు అధ్వానంగా తయారైంది.

ఆర్‌అండ్‌బీ రోడ్డుకు చందాలతో మరమ్మతులు
రహదారి అభివృద్ధికి తోలిన గ్రావెల్‌

 చొరవచూపిన తెల్లగట్ల గ్రామస్థులు  

పుల్లలచెరువు, జూన్‌ 25: ‘అది పుల్లలచెరువు- వినుకొండకు వెళే ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో రోడ్డు అధ్వానంగా తయారైంది. దీంతో నిత్యం ప్రయాణీకులు నరకయాతన అనుభవిస్తున్నారు. ముటుకుల పంచాయతీలోని తెల్లగట్ల వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో అఽధికారులకు, నేతలకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో ప్రజలు విసుగు చెంది శనివారం ఉదయం రోడ్డుకు గ్రామస్తులే చందాలు చేసుకోని రోడ్డుకు గ్రావెల్‌ పోయించారు.’ ఈ రహదారిని 1995వ సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రాయ సడక్‌ యోజన ద్వారా రూ.40లక్షలతో పుల్లలచెరువు- ముటుకుల మధ్య నిర్మించారు. బీటీ రోడ్డుతో పాటు మధ్యలో ఉండే తెల్లగట్ల వద్ద సిమెంట్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే  ఈ రోడ్డు పంచాయతీ రాజ్‌ పరిధిలో ఉన్న సమయంలో ఒకటి రెండు సార్లు మరమ్మతులు చేశారు. ఇక 2016లో ఈ రోడ్డు అర్‌అండ్‌బీ పరిధీలోకి చేర్చారు. అయితే నాటి నుంచి కనీసం మరమ్మతులకు నోచుకోక పోవడంతో గ్రామస్తులు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  దీంతో శనివారం గ్రామస్థులు సూమారు రూ.60 వేల వరకు చందాలు వేసుకొని రోడ్డుకు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించమని నేతల చూట్టూ ప్రదక్షణలు చేసిన పట్టించుకోకపోవడంతో స్వంత నిధులతో నిర్మించుకుంటున్నామని అన్నారు. తమ సొంత నిధులతో రోడ్లు వేసుకోవాల్సి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. గతంలో నిండు గర్భిణి, ముగ్గరు పిల్లలు జారీ పడ్డారని ఇలాంటి భాధలు చూడలేక రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ప్రమాదం జరిగి చనిపోతే నాయకులు వచ్చి పరామర్శలతో ఫొటోలు తీయించుకు పోవడం మినహా ఒరగబెట్టేదేమి లేదని విమర్శించారు. ప్రభుత్వం చేతగాని తనంతోనే ఈ దుస్ధితి అని తక్షణమే రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-06-26T07:18:37+05:30 IST