చిలమత్తూరు ఆసుపత్రిలో మరమ్మతులు.. చెట్ల కిందే చికిత్స.!

ABN , First Publish Date - 2021-04-14T06:05:43+05:30 IST

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిగా ఏక కాలంలో మరమ్మతులు చేస్తుండగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిలమత్తూరు ఆసుపత్రిలో మరమ్మతులు.. చెట్ల కిందే చికిత్స.!
చెట్ల కింద వైద్యం అందిస్తుండగా... ఎండకు క్యూలో ఉన్న రోగులు

చిలమత్తూరు, ఏప్రిల్‌ 13 : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిగా ఏక కాలంలో  మరమ్మతులు చేస్తుండగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్యులు రోగులకు ఆవరణంలోని చెట్ల కింద వైద్యం అందిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముందు చూపులేకపో వడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఈ ఆసుపత్రికి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వారంతా కూర్చొడా నికీ సరైన సదుపాయాలు లేక.. చెట్ల కింద క్యూ లో  ఉంటూ చికిత్సలు పొందుతు న్నారు.  చివరికి అత్యవసర వైద్యాన్ని సైతం వైద్యులు చెట్ల కిందనే అంది స్తున్నారు. ఇప్పటికైనా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయాలని రోగులు కోరుతున్నారు. 


Updated Date - 2021-04-14T06:05:43+05:30 IST