అటవీ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2022-09-29T05:38:42+05:30 IST

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అటవీ శాఖ విశాఖపట్నం సర్కిల్‌ను పునర్వ్యవస్థీకరించారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు కేంద్రంగా ప్రాదేశిక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కేంద్రంగా సామాజిక డివిజన్లు ఉండేవి. అయితే ప్రస్తుతం నర్సీపట్నంలో వున్న ప్రాదేశిక (టెరిటోరియల్‌) డివిజన్‌ను అనకాపల్లికి మార్చారు. కొత్తగా చింతపల్లి, పార్వతీపురం మన్యంలో ప్రాదేశిక (టెరిటోలియల్‌) డివిజన్లు ఏర్పాటుచేశారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో సామాజిక డివిజన్‌లు ఎత్తివేసి కొత్తగా అనకాపల్లిలో ఒకటి ఏర్పాటుచేశారు. కొత్త డివిజన్‌లలో అధికారులు బుధవారం నుంచి పాలన ప్రారంభించారు.

అటవీ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ
అనకాపల్లిలో సామాజిక అటవీ డీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్న లక్ష్మణ్‌

విశాఖ సర్కిల్‌లో ఎనిమిది డివిజన్లు ఏర్పాటు

అనకాపల్లిలో కొత్తగా ప్రాదేశిక, సామాజిక డివిజన్‌ల ఏర్పాటు

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అటవీ శాఖ విశాఖపట్నం సర్కిల్‌ను పునర్వ్యవస్థీకరించారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు కేంద్రంగా ప్రాదేశిక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కేంద్రంగా సామాజిక డివిజన్లు ఉండేవి. అయితే ప్రస్తుతం నర్సీపట్నంలో వున్న  ప్రాదేశిక (టెరిటోరియల్‌) డివిజన్‌ను అనకాపల్లికి మార్చారు. కొత్తగా చింతపల్లి, పార్వతీపురం మన్యంలో ప్రాదేశిక (టెరిటోలియల్‌) డివిజన్లు ఏర్పాటుచేశారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో సామాజిక డివిజన్‌లు ఎత్తివేసి కొత్తగా అనకాపల్లిలో ఒకటి ఏర్పాటుచేశారు. కొత్త డివిజన్‌లలో అధికారులు బుధవారం నుంచి పాలన ప్రారంభించారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, చింతపల్లి డివిజన్‌ల పరిధిలో నాలుగు లక్షల చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగా ప్రాదేశిక (టెరిటోరియల్‌) డివిజన్ల వారీగా పరిశీలిస్తే...శ్రీకాకుళంలో 44,574.95 చదరపు కిలోమీటర్లు, పార్వతీపురం మన్యంలో 1,07,727.57 చ.కి.మీ.లు., విజయనగరంలో 17,240.15 చ.కి.మీ., విశాఖపట్నంలో 14,512.02 చ.కి.మీ., అనకాపల్లిలో 78,311.86 చ.కి.మీ., పాడేరులో 1,97,871.90 చ.కి.మీ.లు, చింతపల్లిలో 1,97,181.0 చ.కి.మీ.ల అటవీ ప్రాంతం ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సామాజిక అటవీ డివిజన్‌లను అక్కడి రెగ్యులల్‌ డివిజన్లలో విలీనం చేయగా విశాఖలో డివిజన్‌ను అనకాపల్లికి తరలించారు. కొత్త డివిజన్‌ల సమాచారం గజిట్‌లో ప్రచురించామని విశాఖపట్నం అటవీ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.రామ్మోహనరావు తెలిపారు. అటవీ శాఖ కొత్త డివిజన్లు ఏర్పాటు విషయాన్ని ప్రజలు గమనించి సమాచారం కోసం సంబంధిత కార్యాలయాలను సంప్రతించాలని కోరారు. కాగా అనకాపల్లిలో కొత్తగా ఏర్పాటుచేసిన సామాజిక డివిజన్‌ డీఎఫ్‌వోగా జి.లక్ష్మణ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 


Updated Date - 2022-09-29T05:38:42+05:30 IST