ప్రముఖ తమిళ రచయిత రాజనారాయణ్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-18T18:04:44+05:30 IST

ప్రముఖ తమిళ రచయిత, నావలిస్ట్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. రాజనారాయణ్ కన్నుమూశారు....

ప్రముఖ తమిళ రచయిత రాజనారాయణ్ కన్నుమూత

పుదుచ్చేరి : ప్రముఖ తమిళ రచయిత, నావలిస్ట్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. రాజనారాయణ్ కన్నుమూశారు. 98 ఏళ్ల వయసున్న రాజనారాయణ్ అనారోగ్యంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మంగళవారం రాజనారాయణ్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. కిరాగా పేరొందిన రాజనారాయణ్ ఇంటిని స్మారక గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. 1980లో పుదుచ్చేరి యూనివర్శిటీలో ప్రొఫెసరుగా పనిచేశారు. కిరా రాసిన ‘గోపాళ్ల పురతు మక్కల్’ అనే పుస్తకానికి 1991లో సాహిత్య అకాడమి అవార్డు లభించింది. కిరాకు తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో కిరాకు అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కిరాకు సంతాపం తెలిపిన వారిలో పళనీస్వామి, రామదాస్, వైకో లున్నారు.

Updated Date - 2021-05-18T18:04:44+05:30 IST