ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ తొలగింపు

ABN , First Publish Date - 2022-07-03T04:42:05+05:30 IST

స్థానిక కూడలిలోని ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ను తొలగించారు.

ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ తొలగింపు
వేంపల్లెలో ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ను తొలగిస్తున్న దృశ్యం

వేంపల్లె, జూలై 2: స్థానిక కూడలిలోని ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ను తొలగించారు. సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో కూడలి మ ధ్యలోని నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ ఏఈ గణే్‌షరెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి తొలగించారు. కూడలి వద్ద బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఇందుకోసం ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ను తొలగించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రోడ్డు వెడ ల్పు పనులు చేపట్టి కొత్త సర్కిల్‌ ఏర్పాటుతో ఎలాగూ తొలగించాల్సి ఉన్నందున సీఎం పర్యటన నేపథ్యంలో తొలగించిన ట్లు అధికారులు తెలిపారు. గతంలో రాజముద్ర కలిగిన ట్రాఫి క్‌ ఐల్యాండ్‌ తొలగింపు వివాదమై కేసుల వరకు వెళ్లింది.

Updated Date - 2022-07-03T04:42:05+05:30 IST