అంబాపురం చెరువులో ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2020-08-11T10:25:06+05:30 IST

నెల్లూరు రూరల్‌ ప్రాంతం అంబాపురం చెరువు లో ఆక్రమణలను జలనవరులశాఖ అధికారులు సోమవారం తొలగించారు.

అంబాపురం చెరువులో ఆక్రమణల తొలగింపు

నెల్లూరు (రూరల్‌), ఆగస్టు 10 : నెల్లూరు రూరల్‌ ప్రాంతం అంబాపురం చెరువు లో ఆక్రమణలను జలనవరులశాఖ అధికారులు సోమవారం తొలగించారు. ఆ చెరువులో కొంతభాగం ఆక్రమణకు గురవుతోందంటూ సోమవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రత్యేక కథనంతో అధికారులు స్పందించారు. ఇరిగేషన్‌ జేఈ బాల సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం చెరువు భూమిలో ఆక్రమణలను పరిశీలించి, ఎక్స్‌కవేటర్‌తో అక్కడి నిర్మాణాన్ని కూల్చివేసింది. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. సాగునీటి వనరులను ఎవరైనా ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2020-08-11T10:25:06+05:30 IST