ఆ పాత మధురాలు గుర్తుకొస్తున్నాయి...

ABN , First Publish Date - 2020-04-10T11:02:16+05:30 IST

కరోనా వైరస్‌ అరికట్టడంలో భాగంగా భారత ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌తో అందరికీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నా యి. ఉదయం

ఆ పాత మధురాలు గుర్తుకొస్తున్నాయి...

లాక్‌డౌన్‌తో మారిన జీవన శైలి

పాత ఆటలతో కాలం గడుపుతున్న చిన్నాపెద్దలు

ఇండోర్‌ గేమ్‌లకు పెరిగిన ప్రాధాన్యం

సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కలివిడి


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)

 కరోనా వైరస్‌ అరికట్టడంలో భాగంగా భారత ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌తో అందరికీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నా యి. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు వివిధ పనుల్లో నిమగ్నమై బిజీ బిజీగా గడిపే కుటుంబ పెద్దలు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్‌కు వెళ్లి వచ్చి చిన్నారులు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లతో గడిపే యువత ఇప్పుడు పాత ఆటల తో కాలం వెళ్లదీస్తున్నారు. చిన్నాపెద్దా, పేద, ధనిక అన్న తేడా లేకుం డా అన్ని వయస్సులవారు ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. క్యారమ్‌, చెస్‌తో పాటు ఆన్‌లైన్‌ గేమ్‌లపైనే కొంత పిల్లల్లో అవగాహన ఉండగా, అష్టా చమ్మ, పుంజీతం, జాన-బెత్త లాంటి గేమ్‌లపై నేటితరం పిల్లలకు, యువకులకు అవగాహన లేకుండాపోయింది. అయితే లాక్‌డౌన్‌ పుణ్య మా అని ఇప్పుడు అందరూ పాత కాలంనాటి ఆటలను మరోమారు నెమరు వేసుకుంటూ ఇప్పుడు వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.


మారిన జీవనశైలి

కరోనా వైరస్‌ అరికట్టడంలో విధించిన లాక్‌డౌన్‌తో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల జీవన శైలి పూర్తిగా మారింది. బిజీ లైఫ్‌లో ఆట విడుపు పూర్తిగా కరువైపోగా, కరోనా పుణ్యమా అని ఇప్పు డు ప్రజలకు కాస్త విరామం దొరికినట్లయింది. కార్పోరేట్‌ ఉ ద్యోగాలు చేసే వారితో పాటు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యో గులు, గృహిణులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థు లు, చిన్నారులు.. ఇలా ఒక్కటేమిటి అందరి జీవన శైలి ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కుటుంబసభ్యులతో గడుపడంతో పాటు వివిధ ఆటల్లో నిమగ్నమ వుతూ మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ఉమ్మడి కుటుంబాల్లోని పెద్దలు కూ డా తమ కాలంనాటి ఆటలను ఆడుతూ ఉల్లాసంగా గడుపు తున్నారు.


ఎండ తీవ్రత కూడా కొద్ది కొద్దిగా పెరుగుతుం డటంతో పాటు లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ బయటకు రావొద్దని నిబంధనలు ఉండటంతో ఎక్కువగా ఇండోర్‌ గేమ్‌లకే ప్రా ధాన్యత ఇస్తున్నారు. క్యారమ్‌, చెస్‌తో పాటు కొంత మంది యువకులు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ పొద్దంతా గడుపుతు న్నారు. ‘ఆంధ్రజ్యోతి’తో జగిత్యాలకు చెందిన ఓ బుక్‌స్టాల్‌ యజమాని మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల తాను 280 క్యారమ్‌ బోర్డులు అమ్మానని పేర్కొనడం చూస్తుంటే ప్రజలు ఆటలతో ఎలా గడుపుతున్నారో అర్థమవుతోంది. చెస్‌కు కూడా కొంత ప్రాధాన్యత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఎక్కువగా అష్టాచెమ్మా, పుంజీతం, జాన -బెత్త లాంటి గేమ్‌లను ఎక్కువగా ఆడుతున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజల జీవన శైలి ఒక్కసారిగా మారిపోయింది.


ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన..

లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ముందుగానే మూ తపడ్డాయి. లాక్‌డౌన్‌ కూడా పొడగిస్తారనే భావనలు వెలువడు తున్న నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా మూత పడ్డాయి. కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలతో పాటు పేరుమోసిన కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు వాట్సాప్‌ ద్వారానే సి లబస్‌ పంపుతూ, ఆన్‌లైన్‌లోనే విద్యా బోధన చేస్తున్నాయి. ఇంకొన్ని పాఠశాలలైతే ఏకంగా పిల్లలకు పరీక్షలు పెట్టకుండానే పై తరగతికి ప్రమోట్‌ అయినట్లుగా భావించి పై తరగతి పాఠశాలనే యూట్యూబ్‌ ద్వారా పంపుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ విద్యాబోధన ఉండవద్దని ప్రభుత్వం భావించినా కొన్ని పాఠశాలలు జిల్లాలో పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పిల్లలు వచ్చే విద్యా సంవత్సరం తమ పాఠశాలలకు ఎక్కడ రాకుండా పోతారనే ఆలోచనతోనే ముందస్తుగానే పై తరగతి పాఠాలను ఆన్‌లైన్‌లో నేర్పిస్తూ రోజువారీగా పరీక్షలు కూడా పెడుతున్నారు. ఇలా మొత్తం మీద లాక్‌డౌన్‌ వల్ల అన్ని వర్గాల జీవన శైలి మారిందనే చెప్పవచ్చు.

Updated Date - 2020-04-10T11:02:16+05:30 IST