మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి రిమాండ్‌

ABN , First Publish Date - 2020-10-02T08:14:39+05:30 IST

ఇంట్లో పనిచేసే మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని అమీర్‌పేట పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి రిమాండ్‌

అమీర్‌పేట, అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో పనిచేసే మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని అమీర్‌పేట పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సైదులు తెలిపిన ప్రకారం వా రం రోజుల క్రితం బల్కంపేట ఈడెన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ఇంట్లో పనిచేసే మహిళను పిలిచి తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో సదరు మహిళ కేకలు వేస్తూ బయటకొచ్చి అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులకు చెప్పింది. వారి సహకారంతో ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పూర్తిస్థాయిలో విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి గురువారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

Updated Date - 2020-10-02T08:14:39+05:30 IST