ఆగస్టు 16 నుంచి కశ్మీర్‌లో తెరుచుకోనున్న ప్రార్థనా స్థలాలు!

ABN , First Publish Date - 2020-08-12T03:45:42+05:30 IST

ఆగస్టు 16 నుంచీ జమ్ముకశ్మీర్‌లో ప్రర్థనాస్థాలాలు తెరుచుకుంటాయని అక్కడి అధికారులు ప్రకటించారు.

ఆగస్టు 16 నుంచి కశ్మీర్‌లో తెరుచుకోనున్న ప్రార్థనా స్థలాలు!

కశ్మీర్: ఆగస్టు 16 నుంచీ జమ్ముకశ్మీర్‌లో ప్రర్థనాస్థాలాలు తెరుచుకుంటాయని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అక్కడి విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను భక్తులు తాకకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా..ఇలా ప్రార్థనామందిరాలకు వెళ్లే వారంతా తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ వినియోగించాలనే నిబంధన కూడా విధించారు. ప్రముఖ మాతా వైష్ణో దేవీ ఆలయంలో కూడా ఒక రోజులో కేవలం 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. సందర్శకుల తాకిడి పెరుగుతున్న రీత్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30 వరకూ ఈ నిబంధనల అమల్లో ఉండనుంది. దీనితో పాటూ .. 5 వేల పరిమితికి లోబడి గరిష్టంగా 500 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా గుళ్లోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-08-12T03:45:42+05:30 IST