పంచాయతీలకు రూ.6.28 కోట్ల విడుదల

ABN , First Publish Date - 2022-01-22T05:16:29+05:30 IST

జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడవ, నాల్గవ విడత కింద రూ.6,28,14,300 విడుదల చేస్తూ పంచాయతీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీలకు రూ.6.28 కోట్ల విడుదల

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 21: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడవ, నాల్గవ విడత కింద రూ.6,28,14,300 విడుదల చేస్తూ పంచాయతీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీలకు విడతల వారీగా నిధులు ఇస్తున్న విషయం తెలిసిందే. జిల్లాకు తలసరి గ్రాంటు రూపేణా రూ.94,25,460, సీనరేజ్‌ గ్రాంటు కింద రూ.3,04,17,890, వృత్తి పన్ను రూపేణా రూ.2,29,70,950 విడుదలయ్యాయి. ఈ నిధులను జిల్లాలోని 1114 పంచాయతీల పీడీ అకౌంట్లకు జమ చేశారు. ఇందులో 15 శాతం పారిశుధ్య పనులకు, 15 శాతం వీధి దీపాల నిర్వహణకు, రోడ్లు, 10శాతం కాలువల నిర్వహణకు, 15 శాతం తాగునీటికి, 30 శాతంసిబ్బంది జీతభత్యాలకు, అనుబంధ రంగాలకు పది శాతం, ఇతర అవసరాలకు ఐదు శాతం చొప్పున ఖర్చు చేసుకోవచ్చని మార్గదర్శకాలను విడుదల చేసింది. 

Updated Date - 2022-01-22T05:16:29+05:30 IST