నేడు కడప కేంద్రకారాగారం నుంచి ఖైదీల విడుదల

ABN , First Publish Date - 2022-08-15T05:23:53+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్ర కారాగారాలు, జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తూ సత్ప్రర్థనతో మెలిగిన 175 మందిని 121 జీవో ద్వారా, 20 మందిని 122 జీవో కింద విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీ్‌షకుమార్‌ గుప్తా ఉత్తర్వులు

నేడు కడప కేంద్రకారాగారం నుంచి ఖైదీల విడుదల

36 మంది విడుదల 

కడప(క్రైం), ఆగస్టు 14: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్ర కారాగారాలు, జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తూ సత్ప్రర్థనతో మెలిగిన 175 మందిని 121 జీవో ద్వారా, 20 మందిని 122 జీవో కింద విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీ్‌షకుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కడప కేంద్ర కారాగారం నుంచి 121 జీవో కింద 31 మంది, 122 జీవో ద్వారా ముగ్గరు ఖైదీలు విడుదలవుతారు. 


విడుదల కానున్న జీవిత ఖైదీల వివరాలిలా..

7 ప్లస్‌ 3 ప్రకారం సుర శ్రీధర్‌రెడ్డి, షేక్‌ పీరాసాహేబ్‌, మంగళ సిద్దప్ప, కె.మూర్తి, పూజారిరెడ్డి భాస్కర్‌, మంగళగిరి వెంకటేష్‌, కె.తిమ్మారెడ్డి, సయ్యద్‌ కమురుద్దీన్‌, బసిరెడ్డి దామోదర్‌రెడ్డి, సిద్దల మురుగయ్య అల్లికుప్పం చంద్రశేఖర్‌ అలియాస్‌ చంద్ర, హరిజన ఎన్‌.చరణ్‌, హసపురం కృష్ణాంజనేయ, కొర్రపాడు దుగ్గన్న, కొర్రపాడు కొండయ్య, కొమ్మ నాగరాజు, గున్న అంకన్న, కొర్రపాడు శ్రీనివాసులు, గొల్ల మల్లికార్జున, సుందరి వెంకటసుబ్బయ్య, ఎం.శ్రీరాముల ఇస్మాయిల్‌, సుదచంద్రయ్య, ఇక్కుర్తి వెంకయ్య, సుధరత్నయ్య అలియాస్‌ సుధ రత్నరావు, ఇక్కర్తి శ్రీనివాసరావు, సాంబయ్య అలియాస్‌ సాంబశివరావులతో కలిసి 25 మంది ఉన్నారు. 

- 14 ప్లస్‌ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిలో షేక్‌ రియాజ్‌, ఈడిగ సోనాథ్‌, మంచి రమే్‌షబాబు, షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌

- వృద్ధాప్య జీవిత ఖైదీలలో మొలకల నారాయణస్వామిరెడ్డి(76), పిట్టి నారాయణ(65)లతో మొత్తం 31 మంది జీవిత ఖైదీలు విడుదలకు అర్హత సాధించారు. ఇద్దరు మహిళా ఖైదీలతో కలిపి 33 మంది విడుదల కానున్నారు.

- కాగా 33 మంది విడుదల ప్రక్రియలో రికార్డులు, కేసుల పెండింగ్‌ను పరిశీలించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. కడపలోని ప్రత్యేక మహిళా కారాగారం నుంచి వర్తికుంట్ల స్వప్న, అంబులగన్‌  కళావతిలు ఉన్నారు. 

- 122 జీవో కింద హత్య, ఇతర కేసుల్లో శిక్షపడిన వారిలో రాష్ట్రంలో ముగ్గురిని విడుదల చేయనున్నారు. వారిలో కె.నాగరాజు అలియాస్‌ మార్టిన్‌,  మరాటి నరసోజిరావు, బేగ్‌ మహబూబ్‌బాషాలు ఉన్నారు. 

ఈ విడుదలకు సంబంధించిన వివరాలను జైళ్లశాఖ డీ ఐజీ ఎం.ఆర్‌.రవికిరణ్‌, కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఐఎన్‌హెచ్‌ ప్రకాష్‌ తెలియజేశారు. 

Updated Date - 2022-08-15T05:23:53+05:30 IST