అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి

ABN , First Publish Date - 2021-02-24T06:31:55+05:30 IST

‘ఐదేళ్లలో రూ.రెండు వేల కోట్లతో హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లయింది. చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి.’ అని వైసీపీ నాయకులకు టీడీపీ నా యకులు సవాల్‌ విసిరారు.

అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి
మాట్లాడుతున్న అంబికా తదితరులు


వైసీపీకి టీడీపీ నాయకుల సవాల్‌ 

అవి ఎలెక్షన్స్‌ కాదు.. సెలెక్షన్స్‌

బెదిరింపులు, దౌర్జన్యాలతో గెలిచారు

పోలీసులూ.. అధికార పార్టీకి దాసోహం

పురం దాహార్థిని తీర్చింది బాలకృష్ణే


హిందూపురం టౌన్‌, ఫిబ్రవరి 23: ‘ఐదేళ్లలో రూ.రెండు వేల కోట్లతో హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లయింది. చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి.’ అని వైసీపీ నాయకులకు టీడీపీ నా యకులు సవాల్‌ విసిరారు. మంగళవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో తెలుగుదేశం నాయకులు ప్రత్యేక సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అనీల్‌కుమార్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు అంజినప్ప, రామాంజినమ్మ మాట్లాడారు. టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదంటూ ఎమ్మెల్సీ ఆరోపణలు చేయడం తగదన్నారు. పంచాయతీ ఎన్నికల తరహా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలవ డానికి ఆ పార్టీ వారు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. వారి బెదిరింపులు, కేసులకు భయపడేది లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు ఎలెక్షన్‌ కాదని.. అవి సెలెక్షన్‌ అని విమర్శించారు. వైసీపీ మద్దతుదా రులకు ఓటేయ్యకుంటే పథకాలను కట్‌ చేస్తామని వలంటీర్లతో బెదిరించారని, డబ్బుతో ప్రలోభపెట్టారని అన్నారు. పోలీసులతోనూ అభ్యర్థులు, వారి బంధువులను బెదిరించారని, ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు యథేచ్చగా మద్యం, డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోలీసులు పైన ఖాకీ డ్రస్సు వేసుకున్నా.. లో పల మాత్రం వైసీపీ కండువాలు కప్పుకున్నారని విమర్శించారు. ము న్సిపల్‌ ఎన్నికల్లో పోలీసుల తీరు మారకపోతే సాక్షాధారాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టుకూ వెళ్తామని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన వారిని కూడా ఓ సీఐ బెదిరిస్తున్నాడని, పోస్టింగ్‌ కోసం అధికార పార్టీకి దాసోహమయ్యాడని అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతం జరగడలేదని,  చిలమత్తూరు మండలంలో 25 ఓట్లతో తెలుగుదేశం మద్దతుదారుడు గెలిస్తే కరెంటు కట్‌ చేసి బెదిరించి వైసీపీ ఖాతాలో వేసుకోవడమే ఇందుకు నిదర్శనమ న్నారు.  హిందూపురానికి దాహార్థిని తీర్చింది ఎమ్మెల్యే బాలకృష్ణేనని పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్‌, అమర్‌నాథ్‌, జయసింహ, సతీష్‌, ప్రెస్‌ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-24T06:31:55+05:30 IST