ఈ పంట నమోదు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-17T04:57:27+05:30 IST

పంటల బీమా, సున్నా వడ్డీ, పంట నష్ట పరిహారం, పంట గిట్టుబాటు ధర, రైతు భరోసా వంటి పథకాలు అన్ని ఈ పంట నమో దుతోనే ముడిపడి ఉన్నాయని సహాయ వ్యవసాయ సహాయకులు(ఏడీఏ) కె.ధన్‌రాజ్‌ అన్నారు.

ఈ పంట నమోదు తప్పనిసరి
శింగరకొండపాలెంలో ఈ పంట నమోదు పక్రియను పరిశీలిస్తున్న ఏడీఏ ధన్‌రాజ్‌, ఏవో వెంకటకృష్ణ

 ఏడీఏ ధన్‌రాజ్‌ 

అద్దంకిటౌన్‌, ఆగస్టు 16: పంటల బీమా, సున్నా వడ్డీ, పంట నష్ట పరిహారం, పంట గిట్టుబాటు ధర, రైతు భరోసా వంటి పథకాలు అన్ని ఈ పంట నమో దుతోనే ముడిపడి ఉన్నాయని సహాయ వ్యవసాయ సహాయకులు(ఏడీఏ) కె.ధన్‌రాజ్‌ అన్నారు. మంగళ వారం మండలంలోని శింగరకొండపాలెం గ్రామంలో జరుగుతున్న ఈ పంట నమోదు పక్రియను ఆయన పరిశీలించారు. ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పం టలను ఈ పంట నమోదు చేసుకోవాలన్నారు. తద్వా రా రైతులకు పథకాలన్నీ అమలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కొర్రపా టి వెంకటకృష్ణ, ఏఈవో కోటేశ్వరరావు, వీఏఏ సాయి బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


 ద్రోణాదులలో పంట నమోదు పరిశీలన

మార్టూరు, ఆగస్టు 16: మండలంలోని ద్రోణాదుల గ్రామంలో మంగళవారం ఉద్యాన సహాయకులతో కలిసి ఉద్యాన అధికారి బి.హనుమం తనాయక్‌ పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. పంట నమోదు ద్వారా భవిష్యత్తులో రైతులకు ప్రభుత్వం ద్వారా అం దే ప్రయోజనాలు, పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్‌ తదితర సౌకర్యాలను రైతులకు తెలియ చేశారు. మిరప రైతులు నాణ్యమైన మిరప నారును ఎంపిక చేసుకోవాలన్నారు. బొప్పా యి, కూరగాయల పంటలను పరిశీలిం చారు. షేడ్‌ నెట్‌లు, సర్సరీల ద్వారా పెంచుతున్న  నారును పరిశీలించారు. 


 31లోగా పంట నమోదు చేయించుకోవాలి

మార్టూరు, ఆగస్టు 16: రైతులందరూ ఈ నెలాఖరులోగా  తాము సాగు చేసే పంటల వివరా లను రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేయించు కోవాలని మార్టూరు సబ్‌ డివిజన్‌ వ్యవసాయ శాఖ ఏడీఏ సుదర్శన రాజు అన్నారు. మంగళవారం ఆయ న మండలంలోని ఇసుకదర్శి గ్రామంలో రైతులు సా గు చేస్తున్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భం గా పంట నమోదు చేయించుకోడంపై వారికి అవగా హన కలిగించారు. ఈ నమోదులో వారి ఫోన్‌ నంబర్లు నమోదు చేయించాలన్నారు. కౌలు రైతులైతే సీసీఆర్‌సీ కార్డులను వారి దరఖాస్తు ఫారాలతో జమ చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వీరగంధం కిరణ్‌కుమార్‌, ఏఈవో మౌలాలి, వీఏఏ లూధియా తదితరులు పాల్గొన్నారు.


పంట నమోదు ఉంటేనే పథకాలకు అర్హులు

బల్లికురవ, ఆగస్టు 16: పంట నమోదు చేసుకొం టేనే ఉద్యాన శాఖ ద్వారా అందించే పథకాలకు అర్హులని మార్టూరు హార్టికల్చర్‌ అధికారి హన్మంత్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం అయన మాట్లాడు తూ ఖరీ ఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రా ల్లో పంట నమోదు చేయించుకోవాలన్నారు. పంట నమోదు ఉంటేనే రైతులకు అన్నిరకాల ప్రయోజనా లు అందుతాయని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. 

Updated Date - 2022-08-17T04:57:27+05:30 IST