ఎస్సారెస్పీకి తగ్గిన వరద

ABN , First Publish Date - 2020-09-30T06:25:00+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్ల ద్వారా గోదావరిలోకి 25వేల

ఎస్సారెస్పీకి తగ్గిన వరద

ప్రాజెక్టులోకి 69వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎనిమిది గేట్ల ద్వారా గోదావరిలోకి 25వేల క్యూసెక్కుల నీటి విడుదల


మెండోర, సెప్టెంబరు 29: నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్ల ద్వారా గోదావరిలోకి 25వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు. ప్రాజెక్టులోకి ఉదయం లక్షా77వేల 324 క్యూసెక్కుల వరద రాగా 16గేట్ల ద్వారా 75,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. మధ్యాహ్నం ప్రాజెక్టులోకి 69 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకు తగ్గడంతో ఎనిమిది గేట్ల ద్వారా 25వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా గోదావరిలోకి ప్రధాన కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు.


ప్రాజెక్టు నుంచి ఐదు ఎస్కేప్‌ గేట్ల ద్వారా ఆరు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా నాలుగు వేల క్యూసెక్కులు, సరస్వ తీ కాలువకు 800క్యూసెక్కులు, లక్ష్మీకాలువకు 300 క్యూసెక్కులు, వరదకాలువకు 7,410 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 651 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 152 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో పోతుందని ఈఈ రామారావు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90టీఎంసీ)లు కాగా మంగళవారం సాయంత్రానికి 1090.6అడుగులు (88.112టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని, గత సంవత్సరం ఇదే రోజు 1085.90 అడుగులు (69.717 టీఎం సీ)ల నీటి నిల్వ ఉంది. జూన్‌ 1వ తేదీ నంచి ప్రాజెక్టులోకి (139.16టీఎంసీల) నీరు వచ్చి చేరిందని ఈఈ తెలిపారు. 


జెన్‌కోలో కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి 

శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నాలుగు వేల క్యూసెక్కులు, ఎస్కెప్‌ గేట్ల ద్వారా ఆరు వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండడంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో టర్బయిన్‌ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుందని జెన్‌కో డీఈ శ్రీనివాస్‌ తెలిపారు. జెన్‌కోలో నాలుగు టర్బయిన్‌ల ద్వారా 34.65మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుందని వివరించారు.

Updated Date - 2020-09-30T06:25:00+05:30 IST