హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 94.79

ABN , First Publish Date - 2021-02-28T09:31:29+05:30 IST

దేశంలో మూడు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై

హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 94.79

ధరలు తగ్గించాలి: కాంగ్రెస్‌ డిమాండ్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశంలో మూడు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెంచాయి. దీంతో, దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.91.17, డీజిల్‌ ధర రూ.81.47కి చేరాయి. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.97.57, డీజిల్‌ ధర రూ.88.60గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.94.79కి చేరింది. డీజిల్‌ ధర లీటరుకు రూ.88.86కి ఎగబాకింది. దేశంలోని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వ్యాట్‌ ఆధారంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. కేంద్ర ప్రభుత్వం తన అహంకారాన్ని పక్కనపెట్టి, ధరలను తగ్గించాలని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated Date - 2021-02-28T09:31:29+05:30 IST