Bank of Maharashtraలో 500 జనరలిస్ట్‌ ఆఫీసర్లు

ABN , First Publish Date - 2022-02-08T21:05:46+05:30 IST

పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జనరలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది...

Bank of Maharashtraలో 500 జనరలిస్ట్‌ ఆఫీసర్లు

పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జనరలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

జనరలిస్ట్‌ ఆఫీసర్లు స్కేల్‌-2: 400

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 25 నుంచి 35 ఏళ్ల అనుభవం ఉండాలి

జనరలిస్ట్‌ ఆఫీసర్లు స్కేల్‌-3: 100

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు: 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌, గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి,

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌-20 ప్రశ్నలు- 15 నిమిషాలు

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-20 ప్రశ్నలు- 15 నిమిషాలు

రీజనింగ్‌ ఎబిలిటీ - 20 ప్రశ్నలు- 15 నిమిషాలు

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌- 90 ప్రశ్నలు- 75 నిమిషాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1180, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.118 చెల్లించాలి.పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22

పరీక్ష తేదీ: మార్చి 12

వెబ్‌సైట్‌: https://www.bankofmaha-rashtra.in/



Updated Date - 2022-02-08T21:05:46+05:30 IST