Abn logo
Oct 1 2020 @ 03:57AM

అంకితభావమున్న ఉద్యోగులకు గుర్తింపు

ఘట్‌కేసర్‌ : అంకితభావంతో పనిచేసిన ఉద్యోగుల కు ప్రజల్లో గుర్తింపు ఉంటుందని ఘట్‌కేసర్‌లోని యూని యన్‌ బ్యాంక్‌ ఉద్యోగులు, ఖా తాదారులు పేర్కొన్నారు. ఘ ట్‌కేసర్‌లోని బ్యాంకు కార్యాలయంలో బుధవారం మేనేజర్‌ కె.జయదేవ్‌ ఉద్యోగ విరమణ సభ జరిగింది. ఈసందర్భం గా జయదేవ్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. అ నంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన సేవలను కొనియాడారు. తర్వాత జయదేవ్‌ మాట్లాడుతూ 35 సంవత్సరాల 3 నెలల ఉద్యోగ కాలంలో ఖాతాదారులకు మెరుగైన సేవలందించడానికి కృషి చేశానన్నారు. ఘట్‌కేసర్‌లో రెండేళ్లు పనిచేశానన్నారు. కొవిడ్‌ సమయంలో ఉత్తమ సేవలందించినందుకు జులై 18న బ్యాంకర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో సన్మానం పొందడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ బి.సాధన, సోమగణేష్‌, రత్నప్రభ, ప్రమోద్‌, శ్రీనివాస్‌, సుమంత్‌, రవి, పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement