ఎన్టీఆర్‌ కారణజన్ముడు

ABN , First Publish Date - 2021-01-19T05:39:20+05:30 IST

‘స్వర్గీయ నందమూరి తారకరామారావు కారణజన్ముడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాతే బీసీలకు తగిన గుర్తింపు లభించింది’ అని శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి కూన రవికుమార్‌ అన్నారు. సోమవారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమదాలవలసలోని త్రికోణ పార్కు వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఎన్టీఆర్‌ కారణజన్ముడు
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కూన రవికుమార్‌

టీడీపీతోనే బీసీలకు గుర్తింపు

శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి కూన రవికుమార్‌

ఆమదాలవలస/గుజరాతీపేట, జనవరి 18 : ‘స్వర్గీయ నందమూరి తారకరామారావు కారణజన్ముడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాతే బీసీలకు తగిన గుర్తింపు లభించింది’ అని శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి కూన రవికుమార్‌ అన్నారు. సోమవారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలోని  టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమదాలవలసలోని త్రికోణ పార్కు వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌తోనే తెలుగు ప్రజలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే... నేడు జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసి పార్టీ ప్రయోజనాలకు వినియోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేర్చిన ఘనత జగన్‌ ప్రభుత్వానికి దక్కుతుందని మండిపడ్డారు. ఆదాయం వస్తున్నా... అప్పులు ఎలా పెరుగుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు. భారతి సిమెంట్స్‌కు... విజయసాయిరెడ్డికి చెందిన మద్యం కంపెనీలకు మాత్రం మేలు చేకూరుతోందని విమర్శించారు. ఇంటర్‌మీడియట్‌ ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపడం సరికాదన్నారు. అమ్మఒడి ద్వారా డబ్బులు ఇచ్చి... అయ్య బుడ్డీ ద్వారా లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తన హయాంలో ఆమదాలవలస నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని... నేటి పాలకులు మాత్రం ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. గాజుల కొల్లివలస వద్ద నిర్వాసితుల కోసం భూమి సేకరించి మౌలిక వసతులు కల్పిస్తే... నేటి పాలకులు 15 ఎకరాల మేర పట్టాల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. స్పీకర్‌ అవినీతికి సహకరిస్తున్న అధికారులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. వైఎస్‌ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోర గోవిందరావు, మొదలవలస రమేష్‌, తమ్మినేని గీత నూకరాజు, ఆనెపు రామకృష్ణ, జగన్నాథనాయుడు, విశ్వనాథం, భాస్కరరావు  పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T05:39:20+05:30 IST