న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. అక్టోబర్ నెలలో భారత మార్కెట్‌లో రియల్‌మి 9 సిరీస్, రియల్‌మి 8ఐ, రియల్‌మి 8ఎస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ నెలలో రియల్‌మి 8ఐ, రియల్‌మి 8ఎస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. దీపావళి పండుగకు ముందే రియల్‌మి 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది.