చర్చలకు సిద్ధం: రష్యా సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-02-26T00:59:40+05:30 IST

శుక్రవారం సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. నిజంగానే చైనా అధ్యక్షుడి ప్రభావమో, లేదంటే మరింకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని..

చర్చలకు సిద్ధం: రష్యా సంచలన నిర్ణయం

మాస్కో: ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం ప్రారంభించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ప్రపంచ దేశాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా దండయాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఆంక్షల పర్వం కురిపించిన పెడచెవిన పెట్టారు. పైగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని, తాను ఎంతకైనా తెగిస్తానని గురువారం హెచ్చరికలు సైతం చేశారు.


అయితే శుక్రవారం సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. నిజంగానే చైనా అధ్యక్షుడి ప్రభావమో, లేదంటే మరింకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. ఇరు దేశాలకు సరిహద్దు దేశమైన బెలారస్ రాజధాని మింస్క్‌కు చర్చల కోసం ఎన్నున్నారు. మింస్క్‌కు తమ ప్రతినిథులను పంపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ కార్యాలయ అధికార ప్రతినిధి డ్మిర్టీ పెస్కోవ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-02-26T00:59:40+05:30 IST