వందకు చేరువలో..

ABN , First Publish Date - 2021-02-26T06:57:43+05:30 IST

పెట్రోలు ధర రూ.వందకు అతి సమీపంలో ఉంది. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.96.41 ఉంది.

వందకు చేరువలో..

  • పెట్రోలు ధర లీటరు రూ.96.41.. ఇక 3.59 పెరిగితే వందే
  • డీజిల్‌ ధర రూ. 90.05.. జనజీవనంపై తీవ్ర ప్రభావం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పెట్రోలు ధర రూ.వందకు అతి సమీపంలో ఉంది. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.96.41 ఉంది. మూడ్రోజుల నుంచి ఇదే ధర ఉంది. ఇక రూ.3.59 పెంచితే రూ.100 అయినట్టే. ఈనెల 1వ తేదీన పెట్రోలు ధర రూ. 91.76 ఉంది. 4న 92.11కు చేరింది. 5న 30 పైసలు పెరగడంతో 92.41కు చేరింది. 9న రూ.92.76కి పెరిగింది. 10న 93.06 కు పెరిగింది. 11న రూ.93.31, 12న రూ.93.60కి పెరిగి రెండ్రోజులపాటు అదే ధర కొన సాగింది. 13న రూ.93.90కి చేరింది. 14న 94.20 అయింది. అలా పెరుగుతూ 17వ తేదీ కి రూ.95.01కి చేరింది. 21న రూ.96.06కి చేరి ఇవాల్టికి రూ.96.41కి వచ్చింది. డీజిల్‌ సం గతి అంతే. ప్రస్తుతం లీటరు డీజిల్‌ ధర రూ.90.05గా ఉంది. ఈనెల 1వ తేదీన రూ. 84.99 ఉంది. ఇది మరో పది రూపాయలు పెరిగితే సెంచరీ కొట్టేస్తుంది. ఈ ధరలు ఎవరూ ఊహించని దెబ్బతీస్తున్నాయి. జనజీవనం మీద తీవ్ర ప్రభావం చూస్తున్నాయి. ఏ ద్విచక్ర వాహనమైనా లీటరు పెట్రోలుకు 40 కిలోమీటర్ల నుంచి 60 వరకూ నడుస్తున్నాయి. పాత వాహనాలు మరీ దారుణం.. లీటరుకు 30 కిలోమీటర్లు కూడా రావు. ఇవి ద్విచక్రవాహనాలు. కొత్తకి కూడా పెద్దగా మైలేజీ ఉండడం లేదు. ఇక ఫోర్‌వీలర్స్‌, ఇతర వాహనాలకు పెట్రోలు బాగా తక్కువ కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితుల్లో వాహనాలు తీయాలంటేనే భయపడిపోతున్నారు. కానీ అవి లేకపోతే కదల్లేని పరిస్థితి. ఇటు ఆటోలు చార్జీలు కూడా పెంచేస్తున్నారు. లారీలు తిప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీకి కూడా నష్టాల్లో పడిపోయిందని అధికారులు గగ్గోలు పెడుతున్నారు. టాక్సీల చార్జీలూ పెంచేస్తున్నారు. వాటి భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఆసుపత్రులకు వెళ్లేవారు, దూర ప్రయాణాలు చేసేవారు, పనుల మీద మార్కెట్‌కు వచ్చేవారు, ఉద్యోగ వ్యాపార నిమిత్తం తిరిగేవారు.. ఇలా అన్ని వర్గాల మీద ఈ పెట్రోలు ధరల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇసుక, కంకర, ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. 

Updated Date - 2021-02-26T06:57:43+05:30 IST