Abn logo
Apr 13 2021 @ 01:29AM

కొవిడ్‌ నిబంధనల మేరకు రంజాన్‌

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 12 : ఈనెల 14 నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ  వేడుకలు జరుపు కోవాలని బందరు ఆర్డీవో ఎన్‌.ఎ్‌స.కె. ఖాజా వలి సూచించారు. ఆర్డీవో కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు, ఇమాంలతో సమావేశం సోమవారం నిర్వహించారు. ఆర్డీవో ఖాజావలి మాట్లాడుతూ, రంజాన్‌ సందర్భంగా మసీదులలో నమాజ్‌ చద వడం, ఉపవాస దీక్షల విరమణ, ఇఫ్తార్‌ విందులు నిర్వహించే సందర్భాలలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ఎక్కువ మంది వచ్చే మసీదులలో షిఫ్టుల వారీగా ప్రార్థనలు జరుపుకుంటే మంచిదన్నారు. ఇన్‌చార్జి డిఎస్పీ మసుంబాషా, తహసీల్దార్‌ సునీల్‌బాబు, ఆర్డీవో కార్యాలయ ఏవో చంద్రశేఖరరావు, సీఐ శ్రీనివాసులు, బీమరాజు,   ఇమాంలు, మత పెద్దలు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement