Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి

ఆత్మగౌరవ సభలోమాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు 

నందివాడ(గుడివాడ), డిసెంబరు 7: అసెంబ్లీలో మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడటం సిగ్గు చేటని టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నందివాడలో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట మంగళశారం  ఆత్మగౌరవ సభ నిర్వహించారు. వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు అహంకారం వీడి మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, కుటుంబ పరంగా సమాన అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీనేనని గుర్తు చేశారు.  మహిళలను గౌరవించే సమాజమే ఉన్నతి చెందుతుందని గ్రహించాలని కోరారు.  మహిళా సర్పంచ్‌లు అడుసుమిల్లి జయసీతామహాలక్ష్మి, మానేపల్లి ఝాన్సీకుమారిలను ఘనంగా సత్కరించారు. మండల తెలుగు మహిళ కన్వీనర్‌ కొల్లి రమ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో జిల్లా తెలుగు మహిళ నాయకులు అసిలేటి నిర్మల, సిరిపురపు తులసీరాణి, తూము పద్మజ, యార్లగడ్డ సుధారాణి, నాయకులు యలమంచిలి సతీష్‌, కాకరాల సురేష్‌; ముళ్లపూడి రమేష్‌, మండల పార్టీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, ప్రధాన కార్యదర్శి నంబూరి రాకేష్‌, ఉపాధ్యక్షుడు తాతినేని మురళి, మండల పార్టీ నాయకులు చాట్రగడ్డ రవికుమార్‌, అడుసుమిల్లి కృష్ణయ్య, ఉప్పల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement