ఫిబ్రవరి నుంచి ఓటీపీ, ఐరిష్‌తోనే రేషన్‌

ABN , First Publish Date - 2021-01-25T05:23:43+05:30 IST

రేషన్‌ బియ్యం తీసుకోవాలనుకునేవారికి ఓటీపీ నిబంధన గుదిబండగా మారింది. ఓటీపీ, ఐరిష్‌ (కనుపాపలు) ద్వారా రేషన్‌ పంపిణీ చేయాలని రేషన్‌ డీలర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఫిబ్రవరి నుంచి ఓటీపీ, ఐరిష్‌తోనే రేషన్‌

ఫోన్‌ నెంబర్‌ అనుసంధానిస్తేనే పంపిణీ

40 శాతానికి పైగా మారిన నెంబర్లు

అరకొరగా మీ-సేవ కేంద్రాల సేవలు

కామారెడ్డి, జనవరి 24: రేషన్‌ బియ్యం తీసుకోవాలనుకునేవారికి ఓటీపీ నిబంధన గుదిబండగా మారింది. ఓటీపీ, ఐరిష్‌ (కనుపాపలు) ద్వారా రేషన్‌ పంపిణీ చేయాలని రేషన్‌ డీలర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవ రి నుంచి ఓటీపీకి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచిం చగా కార్డుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉ మ్మడి జిల్లాలో 40 శాతానికిపైగా కార్డుదారుల ఫో న్‌ నంబర్లు మారాయని సొంతశాఖ అధికారులే చె బుతుండగా.. డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. ఓటీపీ రావాలంటే ఆధార్‌కార్డు నమోదులో చే సిన ఫోన్‌ నంబర్‌కే చేరుతుండగా ఆ నెంబర్‌ ప్ర స్తుతం కార్డుదారు దగ్గర లేకపోవడమే అసలు స మస్య. ఆధార్‌ కేంద్రాల్లో ఫోన్‌ నెంబర్‌ను అనుసం ధానం చేసుకోవాలని చెబుతుండగా వారంలోగా సాధ్యామా? ఉన్న అరకొర కేంద్రాలతో కార్డుదారు లకు సేవలందుతాయా అనేది ప్రశ్నార్థకం.

అసలు ఓటీపీ అంటే..?

వన్‌ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)తోనే రేషన్‌ సరుకు లు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆదేశం. ఆధార్‌ నమో దులో ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌తోనే లావాదేవీలు జరుగుతాయి. పౌరసరాఫరాల శాఖ రేషన్‌కార్డుకు ఆధార్‌నంబర్‌ను అనుసంధానించిన సంగతి తెలి సిందే. రేషన్‌ దుకాణానికి వెళితే కార్డు నెంబర్‌ కొ ట్టగానే ఆధార్‌లో అప్పుడు నమోదుచేసిన నెంబర్‌ కు ఓటీపీ వెళుతుంది. సదరు నెంబర్‌ చెబితేనే రే షన్‌ బియ్యం ఇస్తారు.

కార్డుదారులకు నెంబర్‌ సమస్య

ఉమ్మడి జిల్లా పరిధిలో 6 లక్షల 39 వేల 804 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 3 లక్షల 90 వేల 687 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతినెలా 15 వేల 287 మెట్రిక్‌ టన్ను ల బియ్యం కార్డుదారులకు సరఫరా చేస్తున్నారు. కి లో రూపాయి చొప్పున ఒక్కరికి అరు కిలోల చొప్పు న ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 49 వే ల 117 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం రేషన్‌ సరఫరా చేస్తున్నారు. అయితే, 40శాతానికి పైగా కార్డుదారుల మొబైల్‌ నెంబర్‌లు మారాయి. ఈ క్రమంలో వారందరూ ఆధార్‌ నమోదు కేం ద్రంలో నెంబర్‌ మార్చుకోవాలని అఽధికారులు చె బుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రేషన్‌ పంపిణీ జ రగనుండగా మరో ఎనిమిది రోజుల్లో సదరు ప్ర క్రియ పూర్తవుతుందా అనేది అనుమానమే.

అరకొరగా ఈ-సేవ కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఈ-సేవ కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. సదరు కేంద్రాల నిర్వ హణలో చాలా మట్టుకు లోపాలే ఉంటాయని ప్ర జలు పేర్కొంటున్నారు. ఇతర మీ-సేవ కేంద్రాలకు వెళితే సదరు సౌకర్యం ఈ-సేవ కేంద్రంలోనే ఉంద ని చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన పౌరసరఫరాల శాఖ ప్రేక్షక పాత్ర పో షిస్తుండడం విడ్డూరం. సమస్యతో ఫోన్‌ చేసినా స్పందించడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. కార్డుదారులను అప్రమత్తం చేయాల్సిన సంబంధిత యంత్రాంగం పట్టనట్టు వ్యవహ రిస్తోంది. ఇది లా ఉంటే.. ఓటీపీ, ఐరిస్‌తోనే రేషన్‌ సరుకులను పం పిణీ చేయనున్నట్టు పౌరసరాఫ రాల అఽధికారులు ప్రకటించారు. వచ్చే నెల నుంచి ఇదే విధానం అమలులో ఉంటుందని పేర్కొ న్నారు. కరోనా దృష్ట్యా వేలిము ద్రలను తీసుకోవడం లేదని వివరించారు. రేషన్‌ కార్డుదా రులు అందరూ సత్వరమే తమ ఆధార్‌కార్డుకి ఫోన్‌ నెంబర్‌ను ఆధార్‌ సెంట ర్‌లో లింకు చేసుకోవాలని సూచించారు. అయితే చాలామట్టుకు ప్రజలకు అసలు ఆధార్‌కార్డులకు ఫోన్‌ నెంబర్‌లు అను సంధానం లేకపోవ డం, కొందరి ఫోన్‌ నెంబర్‌లు మార్పు జరగడంతో ఫిబ్రవరి నెల రేషన్‌ అందు తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-01-25T05:23:43+05:30 IST