దారిమళ్లుతున్న రేషన్‌ బియ్యం

ABN , First Publish Date - 2021-10-20T05:03:22+05:30 IST

పేదలకు దక్కాల్సిన బియ్యం దళారుల చేతిలో పడి బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

దారిమళ్లుతున్న రేషన్‌ బియ్యం
మంగళవారం పట్టుబడ్డ రేషన్‌ బియ్యం

ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు దాటవేత

భద్రాచలం, అక్టోబరు 19: పేదలకు దక్కాల్సిన బియ్యం దళారుల చేతిలో పడి బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల రేషను బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇళ్లల్లో రేషను బియ్యం అక్రమంగా భారీ ఎత్తున నిల్వ ఉంచిన సంఘటనలు వెలుగులోకి రావడంతో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా భద్రాచలం పట్టణంలోని రెవెన్యూ కాలనీలో మంగళవారం ఆటోలో రేషను తరలిస్తుండగా భద్రాచలం ఆర్‌ ఐ బి.నర్సింహారావు తమ సిబ్బందితో పట్టుకొని సీజ్‌ చేశారు. కాగా ఈ సమయంలో ఆటో డ్రైవరు పరారీ అయ్యాడు. ఇలాంటి సం ఘటనలు భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, కరకగూ డెం తదితర మండలాల్లో గతంలో చోటు చేసుకున్నాయి.  

పట్టుబడుతున్నా యథేచ్ఛగా...

రేషను బియ్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో రెవెన్యూ పోలీసు, పౌరసరఫరాల అధికారులు పట్టుకుంటున్నా దళారులు అక్రమంగా రేషను బియ్యంను తరలిస్తూనే ఉండటం గ మనార్హం. ఈ రేషను బియ్యంను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్‌ క్రాసు రోడ్డు వద్ద జూన్‌ 29న ఆటోలో నాలుగు క్వింటాళ్ల రేషను బియ్యం తరలిస్తుండగా పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసు లు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. ఆగస్టు 5న ఏడు క్వింటాళ్ల రేషను బియ్యం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గల ఓ నివాసంలో ఉండటంతో గు ర్తించి ఆ బియ్యాన్ని సీజ్‌ చేసి బాధ్యులపై కేసు నమోదు చే శారు. ఆగస్టు 7న బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్‌ క్రాసు రోడ్డులో 6.80 క్వింటాళ్ల రేషను బియ్యాన్ని మణుగూరు వైపు రెండు ఆటోల్లో తరలిస్తుండగా పట్టుకు న్నారు. ఆగస్టు 8న బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, టేకుల చెరువు గ్రామాల్లో నివాస గృహాల్లో 38 క్వింటాళ్ల రేషను బియ్యం అక్రమంగా దాచి ఉంచగా గుర్తిం చి పట్టుకున్నారు. అశ్వాపురం మండలం మల్లెలమడుగులో గతంలో 70 క్వింటాళ్ల బియ్యంను అధికారులు పట్టుకోగా మూడు నెలల క్రితం ఓ రైసు మిల్లును సీజ్‌ చేశారు. కరకగూడెం మండలంలో ఒకసారి 60 క్వింటాళ్లు ఒకసారి, ఆరు క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. కాగా భద్రాచలంలో సైతం పలుమార్లు రేషను బియ్యం అక్రమంగా తరలిస్తుం డగా  పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా రెవె న్యూ కాలనీలో ఆటోలో రేషను బియ్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తరచూ రేషను బియ్యంను ఇత ర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుబడిన సంఘటనలు కొన్నైనా అక్రమంగా తరలిపోతున్న రేషను బియ్యం అధిక సంఖ్యలో ఉందనే విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలో అధికారులు మరింత పకడ్బందీగా దారిమళ్లుతున్న రేషను బియ్యం పట్టుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-20T05:03:22+05:30 IST